WNP: తాడిపర్తి నుంచి చెన్నూరుకు వెళ్లే రహదారికి బీటీ రోడ్డు, బ్రిడ్జి నిర్మించాలని చెన్నూరు సర్పంచ్ శారద సురేష్ నాయక్ కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. 2023 ఎన్నికల ముందు మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేసిన, నేటికీ పనులు మొదలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు, బ్రిడ్జి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.