కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను అధికారులు పూర్తిగా నిషేధించారు. అక్కడ ఫొటోలు, వీడియోలు తీయడం లేదా రీల్స్ చేయడంపై కఠిన ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.