KNR: గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో పిచ్చికుక్కల దాడిలో అటికం మధుసూదన్‌కు చెందిన పాడి దూడ మృతి చెందింది. సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో జరిగిన ఈ ఘటనలో సుమారు రూ. 30 వేల విలువైన పశువు చనిపోయింది. గత కొన్ని రోజులుగా గన్నేరువరం మండలంలో పిచ్చికుక్కలు పశువులపై తరచూ దాడులు చేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.