• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జోగి రమేష్ నివాసాన్ని సందర్శించిన లక్ష్మీపార్వతి

NTR: ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు పెట్రోల్ బంకులతో దాడి చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని ఏపీ తెలుగు అకాడమీ మాజీ ఛైర్మన్,ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, జోగు రమేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దాడి చేసిన వాటిని శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

February 28, 2026 / 06:00 AM IST

నేడు జీవీఎంసీ సర్వసభ్య సమావేశం

VSP: జీవీఎంసీ సర్వసభ్య సమావేశాన్ని ఇవాళ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 37 అంశాలతో అజెండా సిద్ధం చేసి సభ్యులకు పంపిణీ చేశారు. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం వచ్చే నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం కానుంది. ఉద్యోగుల సర్వీస్‌ అంశాలు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది కొనసాగింపు, ఆమోదం వంటి అంశాలు అజెండాలో పొందుపరిచారు.

February 28, 2026 / 06:00 AM IST

బంగారు దొంగతనం.. ఏడాది పాటు జైలు శిక్ష

NLR: వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసులో నెల్లూరు జడ్జి సోమశేఖర్ ముద్దాయికి ఏడాది పాటు జైలుశిక్ష విధించారు. 2017 అక్టోబర్ 25వ తేదీన బీవీ నగర్‌కు చెందిన వ్యక్తికి నిందితుడు ఆహార పదార్ధాలలో మత్తు పదార్థం కలిపి రూ. 3.50 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.

February 28, 2026 / 06:00 AM IST

జిల్లా యువతకు జాబ్ మేళా: సీఎండీ

ATP: జిల్లా యువతకు మార్చి 4న తిరుపతిలోని APSPDCL కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేస్తాయని సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. పదో తరగతి నుంచి ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 28, 2026 / 06:00 AM IST

విశిష్ట గుర్తింపు నమోదుకు నేడే చివరి తేదీ

AKP: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే రైతు సంక్షేమ పథకాలు వర్తించాలంటే విశిష్ట గుర్తింపు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి విజ్ఞప్తి చేశారు. విశిష్ట గుర్తింపు నమోదుకు శనివారం సాయంత్రం వరకు గడువు ఉందన్నారు. ఫోన్ నెంబర్, ఆధార్, పట్టాదారు పాసుబుక్ జిరాక్స్ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

February 28, 2026 / 06:00 AM IST

నేడు పెనుకొండలో మంత్రి సవిత పర్యటన

సత్యసాయి: మంత్రి సవిత ఇవాళ పెనుకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం కోడిగినహల్లిలో పెన్షన్ల పంపిణీ, రూ.1.80 కోట్లతో బీసీ హాస్టల్ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, విట్టాపల్లి రోడ్డు పనుల పరిశీలన చేయనున్నారు. మధ్యాహ్నం పెనుకొండ పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.

February 28, 2026 / 06:00 AM IST

ALERT: నోటిఫికేషన్ వచ్చేసింది

DEiEd, DPSE కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన DEECET 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఆసక్తి గలవారు మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 21, 22 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మార్చి 5 నుంచి వెబ్‌సైట్‌లో ఉంటాయని కన్వీనర్ రమేష్ తెలిపారు. పరీక్ష ఫీజు రూ.500. SC/ST/PwDలకు రూ.450.

February 28, 2026 / 06:00 AM IST

నేడు వెంకన్న స్వామి రెండో శనివారం ఉత్సవాలు

PLD: రాజుపాలెం మండలం దేవరంపాడులోని ప్రసిద్ధ నేతి వెంకన్న స్వామి వారి రెండో శనివారం వేడుకలు నేడు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల కోసం దేవాదాయ శాఖ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపు ఆలయ ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడంతో పాటు, భక్తులందరికీ భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

February 28, 2026 / 06:00 AM IST

జిల్లాను ముందంజలో నిలపాలి: జేసీ

కోనసీమ: రెవెన్యూ, పౌరసరఫరాల విభాగాల్లో సిబ్బంది అంకిత భావంతో పనిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జేసీ నిశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రెవెన్యూ క్లినిక్ నిర్వహణ, స్పందన అర్జీల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు.

February 28, 2026 / 05:51 AM IST

జనాభా లెక్కల నమోదు పక్కాగా చేయాలి: కమిషనర్

E.G: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో జనగణన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘జనాభా లెక్కింపు-2027’ దేశాభివృద్ధికి అత్యంత కీలకమని, యంత్రాంగం అంకితభావంతో పనిచేయాలన్నారు.

February 28, 2026 / 05:50 AM IST

‘ఫైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’

JGL: విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, రాయికల్ ఎస్సై సుదీర్ రావు అన్నారు. రాయికల్ మండలం భూపతిపూర్ ఉన్నత పాఠశాలలో పోలీస్ కళాబృందం ప్రదర్శనలు ఇచ్చారు.సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, ట్రాఫిక్ నియమాలు, సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలు, రోడ్డు భద్రత నియమావళిలో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమం, ఆధునిక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

February 28, 2026 / 05:49 AM IST

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

JGL: భీమారం మండలం కమ్మరిపేట గ్రామానికి చెందిన కోటగిరి రాజేందర్ అనే వ్యక్తి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 15 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

February 28, 2026 / 05:46 AM IST

గణితాన్ని సులువైన పద్ధతిలో బోధించాలి: రాజర్షి షా

ADB: గణితాన్ని సులువైన పద్ధతిలో బోధిస్తే విద్యార్థులు ఆసక్తి చూపుతారని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ‘ఫస్ట్ ఇన్ మ్యాథ్స్’ పేరుతో వినూత్న పైలెట్ ప్రాజెక్టును ఆయన నిన్న ప్రారంభించారు. విద్యార్థులు లెక్కలను కేవలం పరీక్షల కోసం కాకుండా, జీవిత నైపుణ్యాలుగా అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

February 28, 2026 / 05:41 AM IST

కల్తీ పాల ఘటన.. 11మంది పరిస్థితి విషమం

E.G: కల్తీ పాల ఘటనలో రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న 15 మందిలో 11 మంది బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నలుగురు రోగుల పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వెల్లడించింది. కాగా 11 మంది రోగులకు ఇప్పటికీ వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.

February 28, 2026 / 05:30 AM IST

తాడిపత్రి అభివృద్ధిపై సీఎం అభినందన

ATP: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ను కలిశారు. మున్సిపాలిటీలో సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు రూ. 22 లక్షల విద్యుత్ బిల్లు ఆదా అవుతున్నట్లు వివరించారు. స్మశానవాటిక అభివృద్ధి, నూతన షాపింగ్ కాంప్లెక్స్ పనుల నమూనాలను అందజేయగా, సీఎం అభినందించారు.

February 28, 2026 / 05:30 AM IST