SKLM: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, తదితరులు బుధవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో కలుసుకున్నారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. డయేరియాతో చనిపోయిన వారి సంఖ్య ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
KDP: బ్రహ్మంగారిమఠం మఠాధిపతి వెంకటాద్రి స్వాముల వారి పట్టాభిషేకం మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను గురువారం సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో ఎస్సై శివప్రసాద్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై వివరించారు. ప్రత్యేక దర్శన క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
SS:పెద్దవడుగూరు మండలంలోని పలు గ్రామాల్లో జింకల బెడద అధికమవుతోంది. మందగా వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. పెద్దవడుగూరు, చిన్నవడుగూరు, దిమ్మగుడి, నాగలాపురం, గుత్తిఅనంతపురం, విరుపాపురం, ఆవులాంపల్లి, మల్లేనిపల్లి, బందార్లపల్లి, తదితర గ్రామాల సమీపంలో రైతులకు చుక్కలు చూపెడుతున్నాయి. పంట పెట్టుబడి కూడా చేతికి అందని పరిస్థితి దాపురించిందన్నారు.
నంద్యాల పట్టణంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఇవాళ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధనకై ప్రతి ఒక్కరూ మార్చి 1న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.
VZM: కొత్తవలస మండల తహసీల్దార్‌గా ఎస్. రమాలక్ష్మీ గురువారం ఇన్‌ఛార్జ్ తహసిల్దార్ పీ.సునీత నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడికి రాకముందు రాష్ట్ర ప్రధాన భూపరిపాలన విభాగంలో పనిచేస్తూ కొత్తవలసకు బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు మండల తహసీల్దార్ గా విధులు నిర్వహించిన అప్పలరాజు కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. భూసమస్యలపై దృష్టి సారిస్తానని రమాలక్ష్మీ చెప్పారు.
MHBD: రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆధ్వైత్ కుమార్ సింగ్ బదిలీ అయ్యారు. హన్మకొండ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న స్నేహ శబరీష్ నూతన కలెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే, ఆమె భర్త డా. శబరీష్ ఇదే జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వర్తించడం విశేషం.
W.G: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (RRR) బ్యాంకులను మోసం చేసి కోట్లాది రూపాయల రుణాలు ఎగ్గొట్టారని ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఆరోపించారు. ఈ కుంభకోణాలపై ఇప్పటికే సీబీఐ కేసులు ఉన్నాయని, ఆయన బయట ఉంటే సాక్షులను భయపెట్టి కేసులను పక్కదారి పట్టించే అవకాశం ఉందని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని సునీల్ కుమార్ తెలిపారు.
AP: శాసనమండలిలో ఉత్కంఠ కొనసాగుతోంది. వివిధ ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలపై చర్చ కోరుతూ వైసీపీ సభ్యలు సభలో ఆందోళనకు దిగారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలకకుండా స్పీకర్ మండలిని మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
TG: భద్రాద్రి కొత్తగూడెంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. రూ.2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. గంజాయి వారికి ఏ విధంగా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
MDK: రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన చింతల రాములు అనే దివ్యాంగుడు గత కొంతకాలంగా ట్రై సైకిల్ లేక ఇబ్బంది పడుతుండడంతో స్థానిక సర్పంచ్ తార్యా నాయక్ తన సొంత నిధులతో ట్రై సైకిల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.
AP: శాసనసభలో ప్రభుత్వం ఇవాళ రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. అసైన్డ్ భూముల చట్టసవరణ బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టగా.. గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పునకు సంబంధించిన బిల్లును మంత్రి డోలా వీరాంజనేయస్వామి సభ ముందు ఉంచారు. ఇకపై వీటిని స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు సచివాలయాలుగా పిలవనున్నారు.
ASF: కౌటాల మండలంలోని రైతులు తమ వ్యవసాయ భూములకు సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని AO ప్రేమలత గురువారం సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే రాయితీలు, యాంత్రీకరణ పనిముట్లు నేరుగా పొందే అవకాశం ఉంటుందన్నారు. గడువు సమీపిస్తున్నందున రైతులు వెంటనే AEOలను లేదా మీసేవ కేంద్రాలలో సంప్రదించాలన్నారు.
నేటి యాంత్రిక జీవనంలో గంటల తరబడి కూర్చొని పని చేయడం ప్రాణాంతకమవుతోంది. ఎక్కువ సేపు కూర్చోవడంతో కదలిక లేకపోవడం వల్ల రక్తప్రసరణ మందగించి గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. అందుకే ఎంత పని ఉన్నా గంటకోసారి సీటు నుంచి లేచి, కనీసం 2 నిమిషాలు నడవాలి. ఈ చిన్న అలవాటు రక్తప్రసరణను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు శారీరక శ్రమను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తన కుటుంబసభ్యులతో గురువారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చి దర్శనం చేశారు. అధికారులు, అర్చకులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఆయన జిల్లా ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని వేడుకుంటూ.. వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు పొందారు.
HYD: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గత కొద్దిరోజుల నుంచి ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. సూరారం, జీడిమెట్ల, గాజులరామారం, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో రెగ్యులర్‌గా పర్యటిస్తున్న కమిషనర్ విధుల పట్ల అలసత్వం వహించిన వారిపై సీరియస్ అవుతున్నారు. చెత్త ఎత్తని వారిపై సీరియస్ అయ్యారు. ఉద్యోగం చెయ్యాలని ఉందా? చెత్త ఎత్తడం కాదు కింద పడొద్దని హెచ్చరించారు.