HYD: రంజాన్ సందర్భంగా చార్మినార్ సందర్శనకు వచ్చే వారే కాకుండా మక్కా మసీదులో నమాజు చేసేందుకు పెద్ద ఎత్తున వస్తారు. దీంతో స్థానికంగా పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పంచ్ మహల్లా, జూలూఖానా, చార్మినార్ యునాని ఆస్పత్రి ప్రాంగణం, కుడా స్టేడియంలో ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు. పార్కింగ్ సౌకర్యం వినియోగించుకోవాలన్నారు.
కాకినాడ రూరల్ 3వ డివిజన్ మూడు గుళ్ల కూడలి వద్ద సోమవారం ఉదయం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు కాకినాడ జగన్నాథపురం నుంచి వచ్చిన కొండమూరి రాజు (45)గా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
NLG: మునుగోడు మండలం లింగవారి గూడెంకు ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యాన్ని కల్పించారు. మునుగోడు నుంచి లింగవారి గూడెం మీదుగా చౌటుప్పల్‌కు వెళ్లే పల్లె వెలుగు బస్సును సోమవారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రారంభించారు. ఆర్టీసీ మంత్రితో మాట్లాడి ఎమ్మెల్సీ బస్సును మంజూరు చేయించారు. అనుచరులతో కలిసి స్వయంగా బస్ టికెట్ తీసుకుని గూడెం వరకు ప్రయాణించారు.
అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను జాయింట్ కలెక్టర్ సీ. విష్ణుచరణ్ స్వయంగా విన్నారు. భూ సమస్యలు, ఇతర సామాజిక పింఛన్ల వినతులను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ పాల్గొన్నారు.
ELR: ఎమ్మెల్యేలు ఏసీ గదుల్లో కాదు ప్రజా క్షేత్రంలోకి వస్తే దోమల బెడద తెలుస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి గోపాలన్ అన్నారు. సీపీఎం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర సోమవారం గణపవరం మండలంలో గణపవరం, వరదరాజుపురం, అర్థవరం, ముగ్గళ్ళ, పిప్పర, చిలకంపాడు మీదుగా సాగింది. దోమల బెడద పడలేకపోతున్నామని ప్రజలు పాదయాత్ర బృందం ముందు వాపోయారు.
KMR: లింగంపేట మండలం ముంబాజిపేట తండాలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భవనానికి గడప పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జగదాంబ సేవలాల్ స్వాములు ప్రత్యేక పూజలు చేసి, గ్రామాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీ. సురేశ్ నాయక్, జి.ప్రకాశ్ నాయక్, ఆలయ కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక 46వ డివిజన్ బృందావనం ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ పరిధిలోని అన్ని ఆసుపత్రులు, ప్రైవేట్ సంస్థలకు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
WNP: నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన భాస్కరాచారి ఫిబ్రవరి 23న అదృశ్యమవగా, భార్య మాధవి సోమవారం వనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల్ని స్కూల్లో విడిచి అచ్చంపేట వెళ్తున్నానని చెప్పిన ఆయన తిరిగి రాలేదు. అయితే, అదే రోజు వనపర్తిలో ఆయన బైక్‌పై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదైనట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
KMM: భారత స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు వర్ధంతి సందర్భంగా సోమవారం వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నివాళులర్పించారు.. భారత స్వాతంత్ర ఉద్యమంలో మొట్టమొదటి బ్రిటిష్ వారిని ఎదిరించిన దీనవనితగా సరోజినీ నాయుడు అనేక విరోచిత పోరాటాలు చేశారని తెలిపారు. ఆమె స్ఫూర్తితో నేటి మహిళలు ముందుకు సాగాలని అన్నారు.
E.G: కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం చాగల్లు మండలం నెలటూరులో రైతు సేవా కేంద్రం వద్ద కోకో రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదగా సబ్సిడీపై పనిముట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు ఆళ్ళ హరిబాబు, AMC ఛైర్మన్ నాదేళ్ల శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.
MDCL: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సప్లై చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను అబుల్లాపూర్ మెట్, ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేయగా.. వారి వద్ద నుంచి 164 కిలోల గంజాయి, కియా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి HYD మీదుగా కర్ణాటక, మహారాష్ట్రలకు సరఫరా చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
W.G: భీమవరం ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ ఎస్.కే రబ్బానీ కుటుంబ సభ్యులను సోమవారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పరామర్శించారు. రబ్బానీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాగపు ప్రసాద్, సయ్యద్ ఖాజా, బాషా, ఖలీల్, శబూ రబ్బానీ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.
SRPT: మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో మహిళా సాధికారతకు వేదికగా నిలిచే ‘స్త్రీ శక్తి’ భవన నిర్మాణానికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ఈ భవనం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి కాకినాడ సిద్ధార్థ నగర్ వాస్తవ్యులు సానబోయిన నాగ రమేష్ కుటుంబ సభ్యులు రూ. 1,01,116 విరాళాన్ని సోమవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.
MBNR: అడ్డాకుల మండల కేంద్రంలోని శివాంజనేయ షిరిడి సాయి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ బి. దశరథ్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక వ్యాపారి బాలాజీ జితేందర్ తన సొంత ఖర్చుతో ఈ పనులు చేపట్టడం విశేషం. గ్రామ పెద్దలు జితేందరన్ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ రోడ్డు భక్తులకు సౌకర్యం కల్పిస్తుందని భావిస్తున్నారు.