• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు విశాఖ రానున్న మాజీ సీఎం జగన్

VSP: మాజీ సీఎం వైఎస్  జగన్ ఈనెల 4న ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు అరకు (M) తంగుల్గూడాలోని రాధాకృష్ణ ఆలయంలో MLA రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుకుని రాణాప్రతాప్ నగర్‌లో మాజీ MLA వాసుపల్లి గణేశ్ నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.

March 3, 2026 / 11:05 AM IST

నాడు సమాజ సేవకులు నేడు ప్రజా సేవకులు

WNP: మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్‌లో కీలక పాత్ర పోషిస్తు నాడు సామాజిక సేవలో భాగస్వాములై, అభాగ్యులైన ఎందరికో మేమున్నామంటూ చేయుతనందించింది. నేడు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సందర్భంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు కారుపోతుల వెంకన్న, పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి, గనగాని శైలజ నర్సయ్య గౌడ్‌లకు శ్రీ రామలింగేశ్వర ఆలయ ఆవరణలో సన్మానం చేశారు.

March 3, 2026 / 11:04 AM IST

ఇంటి పన్ను వసూలు చేస్తున్న డిప్యూటీ ఎంపీడీవో

ELR: హోలీ పండగ సెలవు రోజైన ఉంగుటూరు మండలంలో అధికారులు ఇంటి పన్ను కులాయి పన్ను వసూళ్లలో నిమగ్నమై ఉన్నారు. ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో మంగళవారం పెద్ద వెల్లమిల్లి, చిన వెల్లమిల్లి, చింతాయిగూడెం గ్రామాలలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను పరిశీలించారు. వెల్లమిల్లి గ్రామపంచాయతీ అభివృద్దికి అప్పారావు, సచివాలయం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

March 3, 2026 / 11:03 AM IST

దేశ రక్షణలో సైనికులే ధ్రువతారలు

జాతీయ రక్షణ దినోత్సవం నేడు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే వీర జవాన్ల త్యాగాలను స్మరించుకునే రోజు ఇది. అచంచలమైన ధైర్యంతో నిరంతరం మనల్ని కాపాడుతున్న త్రివిధ దళాల సేవలు వెలకట్టలేనివి. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. శాంతిని కాంక్షిస్తూనే శత్రువుల ఆటకట్టించే మన రక్షణ వ్యవస్థకు సెల్యూట్ చేద్దాం. జై హింద్.

March 3, 2026 / 11:03 AM IST

మరోసారి పెరిగిన చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్‌లో బ్యారెల్ చమురు ధర 79.44 డాలర్లకు చేరుకుంది. నిన్న ఈ కాంట్రాక్టులు అత్యధికంగా 82.37 డాలర్లకు తాకినట్లు అధికారులు తెలిపారు. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్‌ ధర 72.40 డాలర్లు తాకింది.

March 3, 2026 / 11:02 AM IST

బాపట్లలో ముప్పలనేని శేషగిరిరావు విగ్రహ ఏర్పాటుకు విజ్ఞప్తి

BPT: బాపట్ల విద్యా ప్రదాత కీర్తిశేషులు ముప్పలనేని శేషగిరిరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ, ఆయన కుమారుడు శేషు సుమంత్ కుమార్, అభిమానులు మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మకు వినతి పత్రం అందించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, త్వరలోనే విగ్రహ ఏర్పాటుకు తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

March 3, 2026 / 11:02 AM IST

కంబాపూర్‌లో హోలీ వేడుకలు

KMR: పిట్లం మండలం కంబాపూర్ గ్రామంలో మంగళవారం హోలీ పండుగను వైభవంగా జరుపుకున్నారు. రంగుల కేళిలో చిన్నారులు, యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం నుంచే వీధుల్లోకి చేరిన గ్రామస్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, అందరూ కలిసిమెలిసి హోలీ సంబరాలను ఆస్వాదించారు.

March 3, 2026 / 11:02 AM IST

అర్ధరాత్రి డ్రైవర్లకు అప్రమత్తత చర్యలు

KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన స్టాప్, ఫేస్ వాష్ అండ్ గోకార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి తర్వాత ప్రయాణిస్తున్న లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్ల డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి అప్రమత్తంగా పంపిస్తున్నారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, కుటుంబ సభ్యులను గుర్తుంచుకోవాలని పోలీసులు సూచించారు.

March 3, 2026 / 11:02 AM IST

పొనుగోడులో హోలీ వేడుకలు

NLG: కనగల్ మండలం పొనుగోడులో హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. గ్రామ యువకులు, పెద్దలు కులమతాలకు అతీతంగా రంగుల కేళిలో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ వాతావరణంతో గ్రామంలో సందడి నెలకొంది. స్నేహితులు, బంధువుల కలయికతో వేడుకలు ఘనంగా ముగిశాయి.

March 3, 2026 / 11:01 AM IST

‘చెత్త కంపు భరించలేకపోతున్నాం’

SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీ మార్కెట్ దరి గొడగల వీధి వద్ద సంవత్సరాల తరబడి చెత్త నిలువలు పేరుకు పోయాయని స్థానికులు తెలియజేశారు. పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. దుర్వాసనతో భరించలేకపోతున్నామని, పిల్లాపాపలతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

March 3, 2026 / 11:01 AM IST

ఆంజనేయ స్వామి ఆలయం మూసివేత

MDK: శివంపేట మండలం చిన్నగొట్టి ముక్కుల గ్రామ శివారులోని చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయం మూసివేశారు. ఈరోజు చంద్రగ్రహణం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ద్వార బంధనం నిర్వహించారు. రేపు ఉదయం ఏడు గంటలకు శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి భక్తుల దర్శనాలు ప్రారంభిస్తామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు.

March 3, 2026 / 11:01 AM IST

పెద్దకాకని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ద్వారం మూసివేత

GNTR: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం పెద్దకాకని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన ద్వారం మూసివేయబడుతుందని ఆలయ స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు తెలిపారు. ఉప ప్రధాన పేటేటి ధన మహేశ్వర ప్రసాద్, వేదపండితులు, అర్చకులు, కార్యాలయ సిబ్బంది బసవ శంకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

March 3, 2026 / 11:00 AM IST

రాజోలులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు

కోనసీమ: రాజోలులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక నాయకులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించి సభ్యత్వం పొందడం వలన జనసేన పార్టీ అభిమానులకు రూ.5 లక్షల జీవిత భీమా లభిస్తుందని, పార్టీ పదవులలో సభ్యత్వం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

March 3, 2026 / 10:57 AM IST

కళ్లజోడు మచ్చలు తగ్గించే చిట్కాలు

నిరంతరం కళ్లజోడు ధరించడం వల్ల ముక్కుపై ఏర్పడే నల్లటి మచ్చలను సహజ చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. కలబంద రసం లేదా కలబంద జెల్‌ను మచ్చలు ఉన్న చోట అప్లై చేయాలి. కీరా, బంగాళాదుంప, టమాటా రసాలను కలిపి రాసి, ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. నారింజ తొక్కల పొడిలో పాలు లేదా పెరుగు కలిపి ప్యాక్‌లా వేసుకుని కొంతసేపటికి క్లీన్ చేస్తే బెటర్.

March 3, 2026 / 10:56 AM IST

నారాయణవనంలో పంట కాలువల పరిశీలన

TPT: నారాయణవనం మండలం తుంబూరు గ్రామపంచాయతీలో పథక సంచాలకులు పంట కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఉపాధి శ్రామికులకు 310 మంది వరకు పనులు వచ్చే విధంగా మార్కింగ్ ఇవ్వాలని, పనులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రతి శ్రామికుడు వంద రోజుల ఉపాధిని పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

March 3, 2026 / 10:54 AM IST