• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రంజాన్ పండగ.. షీర్ ఖుర్మా ప్రత్యేకం

రంజాన్ పండుగ రోజు ముస్లింలు చేసే షీర్ ఖుర్మాకు ప్రత్యేకత ఉంది. పాలు, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, సేమియాతో చేసే పౌష్టికాహార డెజర్ట్. పాలు, డ్రై ఫ్రూట్స్‌లో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఎముకలను బలంగా ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఖర్జూరాలు, చక్కెరలో ఉండే సహజ సిద్ధమైన తీపి, నీరసాన్ని తగ్గించి శరీరానికి శక్తిని ఇస్తుంది.

March 21, 2026 / 09:20 AM IST

కల్తీ పాల ఘటన.. కోలుకుంటున్న బాధితులు

E.G: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో అస్వస్థతకు గురైన వారిలో నలుగురు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు డీఎంహెచ్ఓ డా.కె. వెంకటేశ్వరరావు తెలిపారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 20 మంది బాధితులలో 15 మంది మృతి చెందగా, ఎన్.కొండబాబు (64) కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం నలుగురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

March 21, 2026 / 09:19 AM IST

పిల్లిని వద్దన్న అమ్మ.. MBBS విద్యార్థిని బలవన్మరణం

TG: హైదరాబాద్‌లోని అల్వాల్‌లో విషాదం నెలకొంది. పిల్లిని పెంచుకోవద్దని తల్లి చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ MBBS విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాణాలను కాపాడాల్సిన వైద్య విద్యార్థిని, ఇంత చిన్న విషయానికే తనువు చాలించడం స్థానికంగా అందరినీ కలచివేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

March 21, 2026 / 09:13 AM IST

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్యుడిపై భారం

BDK: ఇల్లందు కొప్పురాయి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూక్యా వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

March 21, 2026 / 09:11 AM IST

చిట్యాలలో మొదలైన నీటి కష్టాలు

NLG: చిట్యాల మున్సిపాలిటీలో వేసవి ముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా 2, 8, 9 వార్డుల్లో సరఫరా సరిగ్గా లేక ప్రజలు అల్లాడుతున్నారు. పైప్‌లైన్లు జామ్ కావడంతో నీటి ఒత్తిడి తగ్గి సరఫరా మందగించింది. దీంతో కౌన్సిలర్లు ట్యాంకర్ల ద్వారా ప్రతి ఇంటికీ డ్రమ్ము చొప్పున నీటిని అందిస్తున్నారు. అధికారులు స్పందించి పైప్‌లైన్ మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

March 21, 2026 / 09:10 AM IST

జిల్లాలో మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక నిఘా

కర్నూలు జిల్లాలో రంజాన్ పండుగ సందర్భంగా శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దర్గా, మసీదులు, ఈద్గాల వద్ద డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టి కీలక ప్రాంతాల్లో నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు.

March 21, 2026 / 09:09 AM IST

రంజాన్ సందర్భంగా చిత్రకారుడి సృజన

NDL: రంజాన్ పండుగ సందర్భంగా ఆళ్లగడ్డకు చెందిన చిత్రకారుడు విజయ్ ఒక అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో భూగోళంపై ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న దృశ్యాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. ఈ కళాఖండం ద్వారా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన చిత్రకారుడి ప్రతిభను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

March 21, 2026 / 09:06 AM IST

కొండెక్కిన కోడి కూర ధరలు!

రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి వరకు కిలో రూ.330 వరకు విక్రయాలు జరిగాయి. ఇవాళ భారీగా పెరిగి రూ.400కు చేరింది. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.380-రూ.400 వరకు అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో రూ.340-350 వరకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడమూ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

March 21, 2026 / 09:06 AM IST

కొండెక్కిన కోడి కూర ధర!

రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి వరకు కిలో రూ.330 వరకు విక్రయాలు జరిగాయి. ఇవాళ భారీగా పెరిగి రూ.400కు చేరింది. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.380-రూ.400 వరకు అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో రూ.340-350 వరకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడమూ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

March 21, 2026 / 09:06 AM IST

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: విద్యాసాగర్

VZM: రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ (వినయ్) శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక చింతన పెంచే ఈ పండుగ.. సోదరభావాన్ని పెంపొందించాలని కాంక్షించారు. రంజాన్ పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖ శాంతులు నింపాలని కోరారు.

March 21, 2026 / 09:05 AM IST

తిరుమలలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన సీఎం

తిరుమల శ్రీవారి దర్శనానంతరం CM చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకున్నారు. స్వయంగా కుటుంబ సభ్యులే భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు మంత్రి లోకేశ్, మనవడు దేవాన్ష్‌ అక్కడి భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.

March 21, 2026 / 09:05 AM IST

హనుమంతరాయ చౌదరి మృతికి నారా లోకేశ్ సంతాపం

ATP: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మరణం పట్ల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. హనుమంతరాయ చౌదరి మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటుగా అభివర్ణించారు.

March 21, 2026 / 09:04 AM IST

జమాతే దర్గాలో ఎమ్మెల్యే ప్రార్థనలు

ప.గో: జిల్లాలో అతిపెద్ద దర్గా అయిన జమాతే దర్గాలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తొలుత ఆయనను ముస్లిమ్ మత పెద్దలు ముస్లిం టోపీ పెట్టీ శాలువాతో సత్కరించారు. అనంతరం అల్పాహార విందు ముస్లిం లతోపాటు ఆరగించారు. అన్నీ మాతలు ఒక్కటేనని ఆయన సూచించారు.

March 21, 2026 / 09:04 AM IST

గ్యాస్ సిలిండర్ల కోసం భారీ క్యూ

CTR: జిల్లాలోని యాదమరి మండలం చిన్న రెడ్డిపల్లి క్రాస్ సంత వద్ద ఇవాళ ఉదయం నుంచే గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరారు. వందలాది సిలిండర్లను లైన్‌లో పెట్టి నిరీక్షిస్తున్నారు. గంటల తరబడి వేచి చూసినా సిలిండర్లు అందడంలేదని పలువురు తెలిపారు. జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ సిలిండర్లు మాత్రం దొరకడంలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

March 21, 2026 / 09:04 AM IST

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన SP

JGL: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ ప్రతి ఇంటిలో ఆనందం, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రేమ, దానం, కరుణ వంటి మానవీయ విలువలు సమాజంలో మరింత బలపడాలని ఆయన పిలుపునిచ్చారు.

March 21, 2026 / 09:03 AM IST