రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి వరకు కిలో రూ.330 వరకు విక్రయాలు జరిగాయి. ఇవాళ భారీగా పెరిగి రూ.400కు చేరింది. విజయవాడలో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.380-రూ.400 వరకు అమ్ముతున్నారు. హైదరాబాద్లో రూ.340-350 వరకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడమూ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.