రంజాన్ పండుగ రోజు ముస్లింలు చేసే షీర్ ఖుర్మాకు ప్రత్యేకత ఉంది. పాలు, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, సేమియాతో చేసే పౌష్టికాహార డెజర్ట్. పాలు, డ్రై ఫ్రూట్స్లో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఎముకలను బలంగా ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఖర్జూరాలు, చక్కెరలో ఉండే సహజ సిద్ధమైన తీపి, నీరసాన్ని తగ్గించి శరీరానికి శక్తిని ఇస్తుంది.