తిరుమల శ్రీవారి దర్శనానంతరం CM చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకున్నారు. స్వయంగా కుటుంబ సభ్యులే భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు మంత్రి లోకేశ్, మనవడు దేవాన్ష్ అక్కడి భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.