CTR: జిల్లాలోని యాదమరి మండలం చిన్న రెడ్డిపల్లి క్రాస్ సంత వద్ద ఇవాళ ఉదయం నుంచే గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరారు. వందలాది సిలిండర్లను లైన్లో పెట్టి నిరీక్షిస్తున్నారు. గంటల తరబడి వేచి చూసినా సిలిండర్లు అందడంలేదని పలువురు తెలిపారు. జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ సిలిండర్లు మాత్రం దొరకడంలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.