• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఫార్మసీలో ఉద్యోగ అవకాశాలు

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ (కొత్తది)లో ఫిబ్రవరి 24న ఉదయం 11 గంటలకు అపోలో ఫార్మసీ ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. SSC, D/B/M.Pharm అర్హత గల 18-35 ఏళ్ల అభ్యర్థులు 100 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్‌తో హాజరుకావాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ తెలిపారు.

February 24, 2026 / 09:40 AM IST

చరణ్‌కుమార్‌కు విజయవంతంగా గుండె మార్పిడి

సత్యసాయి: మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చొరవతో కదిరి యువకుడు చరణ్‌కుమార్‌కు బెంగళూరులోని వైదేహీ ఆసుపత్రిలో గుండె మార్పిడి సర్జరీ సక్సెస్ అయింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన యువకుడి నుంచి గుండెను సేకరించి డా.దుర్గాప్రసాద్‌రెడ్డి వైద్య బృందం చరణ్‌కు అమర్చారు. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నారని మంత్రి ప్రతినిధి హారీశ్ బాబు తెలిపారు.

February 24, 2026 / 09:40 AM IST

జిల్లాలో ఇద్దరు ఎస్సైలపై ఛీటింగ్ కేసు నమోదు

BDK: బూర్గంపాడు పోలీసులు ఇద్దరు ఎస్సైలపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. గతంలో భద్రాచలం టౌన్ ఎస్సైగా పనిచేసిన మహేష్, అతని తమ్ముడు ఎస్సై రాణాప్రతాప్‌పై ఈ చర్య తీసుకున్నారు. వ్యాపారం పేరుతో 35 శాతం అధికంగా చెల్లిస్తామంటూ కుమారి అనే మహిళ వద్ద రూ. 1.82 కోట్ల మొత్తం తీసుకుని మోసగించారనే అభియోగంపై ఆ ఇద్దరిపై ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 09:40 AM IST

ఏడుస్తూ నిద్రపోయాను: మృణాల్‌ ఠాకూర్‌

శరీర బరువు కారణంగా తాను ట్రోలింగ్‌ ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో నటి మృణాల్‌ ఠాకూర్‌ చెప్పింది. ‘నాకు ఇంకా ఆ రోజులు గుర్తున్నాయి. ఏడుస్తూ నిద్రపోయి.. ఉబ్బిన కళ్లలో మేల్కొన్న రోజులు ఉన్నాయి. శరీరాకృతి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనుకునేదాన్ని. దాన్ని అధిగమించడానికి చాలా ధైర్యం కావాలి. అప్పుడే అర్థమైంది.. మనం ఎలా ఉన్నా నచ్చేవాళ్లకు నచ్చుతాం’ అని పేర్కొంది.

February 24, 2026 / 09:40 AM IST

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 694.13 పాయింట్లు నష్టపోయి 82600.53 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 201.90 పాయింట్ల నష్టంతో 25511.10 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.96గా ఉంది.

February 24, 2026 / 09:39 AM IST

విద్యార్థులకు ల్యాప్టాప్‌ల పంపిణీ: ఎమ్మెల్యే నాయిని

HNK: ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కజ్ ప్రభుత్వ పాఠశాలలో నిన్న సాయంత్రం బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో రూ. 8 లక్షల విలువచేసే 20 లాప్టాప్‌లు విద్యార్థులకు అందించినట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 09:39 AM IST

భూదాన్ భూముల్లో తీవ్ర ఉద్రిక్తత

TG: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఉద్రిక్తత నెలకొంది. రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. పూరిళ్లను ఖాళీ చేయించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఖాళీ చేసేందుకు స్థానికులు గడువు కోరుతున్నారు. కాగా, భూదాన్ భూవివాదం కొన్నేళ్లుగా కోర్టులో నడుస్తోంది. 31 ఎకరాల్లో స్థానికులు పూరిళ్లు వేసుకున్నారు. 

February 24, 2026 / 09:38 AM IST

‘ఇంటర్నెట్ నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు’

NRML: రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఆయా ప్రైవేట్ కళాశాలలు హాల్ టికెట్లు జారీ చేయడంలో ఇబ్బందులకు గురి చేస్తే విద్యార్థులు నెట్ నుండి హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరు కావచ్చని డీఐఈఓ పరుశురాం నేటి ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే విద్యార్థుల మొబైల్ ఫోన్లకు హాల్ టికెట్ లింకును పంపించామని తెలిపారు.

February 24, 2026 / 09:37 AM IST

గోశాలను పరిశీలించిన కలెక్టర్

NTR: జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో పల్లె పండగ 2.0 కార్యక్రమం కింద నిర్మించిన గోశాలను (కమ్యూనిటీ గోకులం) ను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.రూ.10 లక్షలతో నిర్మించిన గోశాల గ్రామంలోని పాలు ఉత్పత్తి చేసే రైతులకు మేలుకలుగుతుందని, పశుసంవర్థక రంగం అభివృద్ధికి తోడ్పడుతుందని కలెక్టర్ తెలిపారు.

February 24, 2026 / 09:33 AM IST

విశాఖలో నేటి కూరగాయల ధరలు

విశాఖపట్నంలోని 15 రైతు బజార్లలో మంగళవారం కాయగూరల ధరలు (కేజీ/రూ) ఇలా ఉన్నాయి. టమాటా 15, బెండకాయలు 30, పచ్చిమిర్చి 55, బీరకాయలు 32, కాలీఫ్లవర్ 12, క్యాబేజీ 14, క్యారెట్ 26, దొండకాయ 46, ఉల్లిపాయలు 18, గోరుచిక్కుడు 34, దోసకాయలు 24, మునక్కాడ 86, అల్లం 66, చిక్కుడుకాయలు 26, కీర 32, వంకాయలు 22గా ఉన్నాయి. మార్కెటింగ్ శాఖ ఆదేశాల మేరకు అమ్మకాలు కొనసాగుతున్నాయి.

February 24, 2026 / 09:33 AM IST

భార్యను కొడవలితో నరికిన భర్త

AP: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను భర్త కొడవలితో నరికాడు. తీవ్రగాయంతో ప్రభుత్వ ఆస్పత్రిలో భార్య గౌరమ్మ చికిత్స పొందుతోంది. అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతూరు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యపై దాడి చేసిన భర్త నాగభూషణం పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 24, 2026 / 09:32 AM IST

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఉమ్మడి KNR జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. KNRలో 36,426, PDPLలో 10,367, JGTLలో 15,125, SRCLలో 8,106 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యార్ధులు 45 ని.లు ముందే సెంటర్‌కు వెళ్లాలన్నారు.

February 24, 2026 / 09:32 AM IST

నీటి సరఫరాలో అంతరాయం

JN: దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో నేడు అంతరాయం కలుగుతుంది అని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన 700mm WBSC లీకేజీ కారణంగా సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదు అని తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు గమనించి మంచి నీటికోసం ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని కోరారు.

February 24, 2026 / 09:32 AM IST

హన్వాడ పోస్ట్ ఆఫీసులో సమావేశం

MBNR: హన్వాడ పోస్ట్ ఆఫీసులో జిల్లా పోస్టుమాస్టర్ వెంకటేశ్వర్లు సిబ్బందితో సమావేశమయ్యారు. సేవింగ్స్, ఆర్డీ, సుకన్య సమృద్ధి, బీమా వంటి పథకాలు ప్రజలకు మేలు చేస్తాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరువ చేసి అందరూ వినియోగించుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. పోస్టుమాస్టర్ చంద్రశేఖర్, సిబ్బంది కూడా పాల్గొన్నారు.

February 24, 2026 / 09:31 AM IST

‘ప్రధాన రహదారిని వెంటనే విస్తరించాలి’

MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో ఉండటంతో రహదారి వేయడానికి వీలుకావడం లేదు. దీంతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే జన్నారం శివారులోని జింకల పార్కు నుండి రెండు కిలోమీటర్ల వరకు నాలుగు వరసల రహదారిగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

February 24, 2026 / 09:31 AM IST