కామారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ’ శిక్షణ కార్యశాల నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని 12 జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్య క్షుడు రామచంద్రరావు హాజరై పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
KKD: ప్రజా సమస్యలు పరిష్కార కోసం జిల్లా, డివిజన్ మండల స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం రోజున యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఒక ప్రకటనలో తెలియచేసారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని తెలిపారు. అధికారులు తప్పనిసరిగా హజరు కావాలన్నారు.
అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం మదనపల్లెకు చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు కలెక్టర్ కార్యాలయంలో జరిగే DDRC సమావేశంలో హాజరై అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. అనంతరం రాయచోటికి వెళ్లి రాత్రి బస చేయనున్నారు.
SDPT: కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు 48 శాతం ఉండే అని ఈ రోజు అది 38 శాతానికి పడిపోయిందని రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో పదిశాతం మంది పిల్లలు తగ్గారని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవానికి హాజరయ్యారు.
NLR: వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మండిపడ్డారు. తనపై అనవసర ఆరోపణలు, విమర్శలు మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. పోలీసు రక్షణ లేకుండా ఎదురుగా రావాలని సవాల్ చేస్తూ, అవసరమైతే మోటుకోవడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు.
KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని మిట్టమానుపల్లెలో లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా, స్థానికంగా ఉన్న శ్రీ కొండా సింగరాయ స్వామి ఉత్సవము మంగళవారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా పంచామృత అభిషేకం అష్టోత్తరం ప్రత్యేక పూజలు, భజనలు, అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. భక్తులు తరలివచ్చి పాల్గొనాలన్నారు.
HYD: బంజారాహిల్స్ పరిధి సాగర్ సొసైటీ ఏరియాల్లో అనుమతులకు మించిన అంతస్తుల నిర్మాణం జరుగుతుందని అక్కడ ప్రజలు ఆరోపిస్తూ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని, నిర్మాణాలపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు.
JGL: SC వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బుగ్గారం మండల కేంద్రంలో MRPS, MSP ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ SC వర్గీకరణను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో MRPS ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షుడు చిర్ర లక్ష్మణ్ మాదిగ, మండల అధ్యక్షుడు పాల్గొన్నారు.
హీరోయిన్ తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్నిసార్లు తనతో కలిసి పనిచేయడం కొంచెం కష్టమనే మాట వింటుంటానని తెలిపింది. ‘బహుశా నాతో పనిచేయని వ్యక్తులు ఇలా ప్రచారం చేసి ఉండొచ్చు. నేనేంటో అందరికీ నిరూపించుకోవాలని అనుకోను. అలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా పనితోనే సమాధానం చెప్తా’ అని చెప్పుకొచ్చింది.
విండీస్ నిర్దేశించిన 196 రన్స్ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. T20 WC లక్ష్య ఛేదనల్లో టీమిండియాకు ఇదే(199/5) అత్యధిక విజయవంతమైన లక్ష్యఛేదన కాగా గతంలో ఈ రికార్డ్ 176/4(2014లో vs SA)గా ఉండేది. ఒవరాల్‌గా టోర్నీలో చరిత్రలో 230(2016లో ENG vs SA), 206(2007లో SA vs WI) తర్వాత ఇది మూడో హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ ఛేజ్.
MLG: యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప ఆలయం తూర్పు ముఖ ద్వారం రోడ్డులో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ రాత్రి వేళల్లో పనిచేయకపోవడంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు వెచ్చించి అలంకారప్రాయంగా ఏర్పాటు చేసిన దీపాలు చీకటిలో మాత్రమే కనిపిస్తున్నాయి. వెంటనే మరమ్మతులు చేపట్టాలని పర్యాటకులు అధికారులను కోరారు.
WNP: వరంగల్లో జరిగిన తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) 4వ రాష్ట్ర మహాసభలో పీ.సురేష్ రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే యూసుఫ్, ప్రధాన కార్యదర్శి నరసింహ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. యూనియన్ బలోపేతానికి సురేష్ కృషి చేస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములలో ఇళ్లు కోల్పోయిన పేదలకు ఈ నెల 15లోగా నివాస స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం స్పష్టం చేశారు. అంతేకాకుండా పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన దళారుల నుంచి ఆ సొమ్ము రికవరీ చేసి బాధితులకు అప్పజెప్పే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.
MDCL: బాచుపల్లి ఏరియాల్లో రాత్రికి రాత్రి వివిధ కంపెనీలు గాలిలోకి విషపూరిత వ్యర్ధాలు విడుదల చేస్తున్నాయని, కెమికల్ వ్యర్ధాల వాసన భరించలేకపోతున్నట్లు అక్కడ ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు పొల్యూషన్ కంట్రోల్ బుడ్డ అధికారులకు కాల్ చేసి ట్రై చేశామని, అయినప్పటికీ స్పందన లేదన్నారు. ప్రభుత్వం కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలన్నారు.
అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి రైతు సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఆమెకు వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారి అభివృద్ధికి పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డులో రైతులకు సౌకర్యాలు కల్పించి, గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.