• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అదుపుతప్పి ట్రాలీ బోల్తా.. డ్రైవర్కు గాయాలు

MHBD: మరిపెడ పట్టణ కేంద్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మరిపెడ నుంచి MHBD జిల్లాకు వెళ్తున్న ఓ ట్రాలీ అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన వాహనాదారులు గాయపడిన డ్రైవర్ను ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 28, 2026 / 04:21 PM IST

ప్రాణహాని ఉన్నా పట్టించుకోను: జంగ్ కుక్

BTS స్టార్ జంగ్‌కుక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన కొత్త ఆల్బమ్ ‘అరిరంగ్’ విడుదల కానున్న నేపథ్యంలో.. మేనేజ్మెంట్ నిబంధనలకు అతీతంగా స్వేచ్ఛగా జీవిస్తానని, ప్రాణహాని ఉన్నా లెక్కచేయనని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. ఆయన భద్రతపై భయపడుతున్న ఫ్యాన్స్, సోషల్ మీడియా వేదికగా జంగ్‌కుక్‌కు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.

February 28, 2026 / 04:20 PM IST

దేవరుప్పులలో పౌరహక్కుల దినోత్సవం

JN: దేవరుప్పులలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి గౌడ్, RI రాజు హాజరై మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి పౌరుడు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సమాజంలో ప్రతి వ్యక్తి ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

February 28, 2026 / 04:20 PM IST

ఇద్దరు సీఐల పై వేటుకు రంగం సిద్ధం?

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల పై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సివిల్ తగాదాల్లో తలదూర్చి భారీగా డబ్బులు తీసుకున్నట్టు ఫిర్యాదులు అందడంతో వారిపై విచారణ జరిగినట్లు సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ ఇద్దరి అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.

February 28, 2026 / 04:18 PM IST

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్

BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రాసేనా రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబసమేతంగా యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన వీవీఐపీ అతిథి గృహం నుంచి ప్రధానాలయంలోకి వెళ్లారు. ఆలయ ముఖ మండపం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు.

February 28, 2026 / 04:18 PM IST

ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం

TG: కామారెడ్డి జిల్లా గాంధారి ఎక్స్‌రోడ్డు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. BJP ఎమ్మెల్యేల బృందాన్ని బాన్సువాడ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తోంది. కామారెడ్డి అంశాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం. బాన్సువాడకు మళ్లీ వచ్చి తీరుతాం’ అని అన్నారు.

February 28, 2026 / 04:18 PM IST

వాసవ్య మహిళా మండలి వృత్తి శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ

KKD: పిఠాపురం పురపాలక సంఘం మెప్మా ఆఫీసులో వాసవ్యమహిళా మండలి ఆధ్వర్యంలో సోలార్ పీవీ టెక్నాలజికల్ ట్రైనింగ్ జరిగింది. 14 రోజుల పాటు మహిళలకు ఉచిత శిక్షణ ఇచ్చారు. ఈ కోర్సు పూర్తయిన వారికి వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ కీర్తి 50 మందికి సర్టిఫికెట్స్, కిట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో CMM వేంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 04:17 PM IST

అన్ని శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలి: కలెక్టర్

BHPL: జిల్లాను ఆకాంక్షిత స్థితి నుంచి ఆదర్శప్రాయ స్థితికి తీసుకెళ్లేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఇవాళ ఐడీవోసీలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ 2.0 సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నీతి ఆయోగ్ నిర్దేశించిన విద్య, వైద్య, సంక్షేమ, వ్యవసాయ అంశాల్లో 100% పురోగతి సాధించాలన్నారు.

February 28, 2026 / 04:17 PM IST

ఉమామహేశ్వర దేవాలయం మూసివేత

NGKL: మార్చి 3వ తేదీన మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా మండల పరిధిలోని శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన ఉమామహేశ్వర దేవాలయం మూసివేయడం జరుగుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ మాధవరెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీనివాస రావులు శనివారం వెల్లడించారు. భక్తులు యాత్రికులు ఈ విషయాన్ని గమనించాలని సహకరించాలని కోరారు. 4వ తేదీ నుంచి యథావిధిగా ఆలయంలో దర్శనం ఉంటుందన్నారు.

February 28, 2026 / 04:17 PM IST

ఆకివీడులో ఫోక్సో కేసు నమోదు

W.G: ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. సమతా నగర్ ప్రాంతానికి చెందిన పాల మరియమ్మ కుమార్తె(మైనర్ బాలిక)ను అదే ప్రాంతానికి చెందిన బోనాల రాము పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగా కలిసినట్లు ఎస్సై తెలిపారు. పెళ్లికి నిరాకరించడంతో తల్లిపాల మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో రాముపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

February 28, 2026 / 04:17 PM IST

పోలీస్ శాఖకి ఆయన చేసిన సేవలు ప్రశంసనీయం

చిత్తూరు ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు పూతలపట్టు పోలీస్ స్టేషన్ నుంచి పదవీ విరమణ పొందిన ASI శేఖర్‌ను పోలీసులు సత్కరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ S.R. రాజశేఖర రాజు, AR అదనపు ఎస్పీ దేవదాస్, ఆయన 39 సంవత్సరాల అంకితభావం, క్రమశిక్షణతో కూడిన సేవను ప్రశంసించారు. ఆయన నిబద్ధత, త్యాగాన్ని ప్రశంసించి ఆయన చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 04:16 PM IST

వంగూరు వాసికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్

NGKL: వంగూరు మండలం డిండిచింతపల్లికి చెందిన సుగురిబాబు కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ విద్యుత్ ఆధారిత వ్యవస్థలపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెసర్ మల్లేశం ఆధ్వర్యంలో పీహెచ్డీ పరిశోధనలు పూర్తి చేశానని అన్నారు. అనంతరం ఈరోజు డాక్టరేట్ స్వీకరించారు.

February 28, 2026 / 04:16 PM IST

పేలుడు ఘటనపై మంత్రి నారాయణ విచారం

AP: కాకినాడలో బాణాసంచా పేలుడు ఘటనపై మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వైద్యులను పంపించి తక్షణ వైద్యసాయం అందించాలని ఆదేశించారు.

February 28, 2026 / 04:15 PM IST

ఈడెన్‌ గార్డెన్స్‌లో పరుగుల వరద..?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన నాకౌట్ మ్యాచ్ జరగనుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుండగా, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్ జరిగే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని సమాచారం. రెండు జట్లలోనూ విధ్వంసకర పవర్ హిట్టర్లు ఉండటంతో భారీ స్కోర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.

February 28, 2026 / 04:15 PM IST

క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారు: ఎస్పీ

మహబూబ్‌నగర్: జిల్లాలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ వెంకయ్యకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి. జానకి శాలువా కప్పి సత్కరించి అభినందించారు. 34 ఏళ్ల సేవలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని ఎస్పీ కొనియాడారు.

February 28, 2026 / 04:14 PM IST