• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’

KDP: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాటాక ప్రయాణించే లారీ, బస్సు, కార్ల డ్రైవర్లను ఆపి, వారి నిద్రమత్తు వదిలించేలా స్వయంగా నీళ్లతో ముఖం కడిగించి పంపుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా సురక్షిత ప్రయాణం చేయాలని పోలీసులు డ్రైవర్లకు సూచిస్తున్నారు.

February 24, 2026 / 09:04 AM IST

రీ-ఓపెన్ అర్జీలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

NDL: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 311, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 176 అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల అసంతృప్తి కారణంగా 283 దరఖాస్తులు రీ-ఓపెన్ అయ్యామన్నారు.

February 24, 2026 / 09:04 AM IST

నరసాపురం డిపోలో ఎర్ర బ్యాడ్జీలతో నిరసన

W.G: ఆర్టీసీలోని 12 డిపోలను పినాకిల్ సంస్థకు అప్పగించాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ నరసాపురం డిపో కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు. NMUA పిలుపు మేరకు తెల్లవారుజాము నుంచే ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడం సరికాదని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు.

February 24, 2026 / 09:02 AM IST

ఒంగోలులో శక్తి యాప్‌పై అవగాహన

ప్రకాశం: ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్, టౌన్ పరిసర ప్రాంతాలలో సోమవారం పోలీసులు మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, విద్యార్థుల స్మార్ట్ ఫోన్లలో శక్తి యాప్‌ని డౌన్లోడ్ చేయించి, దాని ఉపయోగాలను పోలీసులు వివరించారు. అత్యవసర సమయంలో ఈ యాప్ ద్వారా పోలీసులను సంప్రదిస్తే, వారు వెంటనే మహిళల వద్దకు చేరుకొని రక్షణ కల్పిస్తారని తెలిపారు.

February 24, 2026 / 09:02 AM IST

జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

GDWL: గద్వాల ఇలవేల్పు జమ్మిచేడు గ్రామంలోని జమ్ములమ్మ అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని శోభయామానంగా అలంకరించి, భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసింది.

February 24, 2026 / 09:01 AM IST

చిప్పగిరిలో జనసేన కార్యకర్తలకు పిలుపు..!

KRNL: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటినుంచే చిప్పగిరిలో కార్యకర్తలు సన్నద్ధం కావాలని జనసేన పార్టీ కన్వినర్ చిరంజీవి సోమవారం పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. యువత, మహిళలను పార్టీలో చురుకుగా భాగస్వాముల్ని చేయడం ద్వారా జనసేనకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు.

February 24, 2026 / 09:01 AM IST

‘అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి’

KNR: సుడా పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైస్ ఛైర్మన్ ప్రఫుల్ దేశాయ్ కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. నగరం, పరిసర గ్రామాల ప్రధాన రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు పెద్దపీట వేయాలన్నారు. వర్టికల్ గార్డెన్లు, పార్కుల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు.

February 24, 2026 / 09:00 AM IST

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు

BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాకకు చెందిన నూనవత్ నవీన్‌పై నమోదైన పోక్సో కేసులో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష నిన్న విధించింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు నిరూపితమవడంతో పాటు రూ. 5 వేల జరిమానా కూడా విధించారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

February 24, 2026 / 09:00 AM IST

హాల్ టికెట్లు ఇవ్వకపోతే.. కఠిన చర్యలు!

TG: రేపటి నుంచి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 30 నిమిషాల ముందే రావాలని అధికారులు సూచించారు. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్రలపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా విద్యార్థులను పరీక్ష హాల్‌కు అనుమతించాలని తెలిపారు. విద్యార్థులకు కళాశాల మేనేజ్ మెంట్ హాల్ టికెట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

February 24, 2026 / 08:59 AM IST

నారాయణపేటలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు

NRPT: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నారాయణపేటలో ప్రతిష్టిత వ్యక్తుల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సభలో సంఘ సభ్యులు దేశభక్తి, హిందూ ధర్మం, భారతీయ సంస్కృతిని కాపాడుతూ సమాజంలో సేవాభావాన్ని పెంపొందించేందుకు ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమం స్థానికులలో చైతన్యాన్ని సృష్టించింది.

February 24, 2026 / 08:59 AM IST

లోకేశ్‌తో చీపురుపల్లి ఎమ్మెల్యే ఆత్మీయ సమ్మేళనం

VZM: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని ఆయన నివాసంలో శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత కిమిడి రామ్ మల్లిక్ నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

February 24, 2026 / 08:57 AM IST

చిత్తూరులో రాత్రి 10 తర్వాత దుకాణాలు మూసివేత

చిత్తూరులో రాత్రి 10 గంటలలోపు దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని తాలూకా, బీఎన్ఆర్ పేట ఎస్ఐలు ఆదేశించారు. దొడ్డిపల్లి, పెనుమూరు క్రాస్, మురుకంబట్టు ప్రాంతాల్లో గస్తీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 24, 2026 / 08:54 AM IST

అభివృద్ధి పనులు మార్చిలోగా పూర్తి చేయాలి: మేయర్

WGL: నగరంలో జనరల్ ఫండ్‌తో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. వేసవి సమయంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలన్నారు.

February 24, 2026 / 08:54 AM IST

నేడు కాకినాడలో జాబ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. డీమార్ట్, స్మార్ట్ మీటర్లు ఇనిస్టాలేషన్, ఎక్షమో, ఆక్వా ఎక్స్ పోర్టు తదితర సంస్థల్లో పని చేసేందుకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 18-32 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు హాజరు కావాలన్నారు.

February 24, 2026 / 08:53 AM IST

ఈ నెల 28 న మండల సర్వసభ్య సమావేశం

VZM: ఈ నెల 28న వంగర మండల పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశ జరగనుందని MPP ఉత్తరావెల్లి సురేశ్‌ ముఖర్జీ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక MPDO కార్యాలయంలో మాట్లాడుతూ… శనివారం ఉదయం 10:30 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుందన్నారు. అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సమగ్ర అభివృద్ధి నివేదికలతో రావాలని సూచించారు.

February 24, 2026 / 08:52 AM IST