ప్రకాశం: ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్, టౌన్ పరిసర ప్రాంతాలలో సోమవారం పోలీసులు మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, విద్యార్థుల స్మార్ట్ ఫోన్లలో శక్తి యాప్‌ని డౌన్లోడ్ చేయించి, దాని ఉపయోగాలను పోలీసులు వివరించారు. అత్యవసర సమయంలో ఈ యాప్ ద్వారా పోలీసులను సంప్రదిస్తే, వారు వెంటనే మహిళల వద్దకు చేరుకొని రక్షణ కల్పిస్తారని తెలిపారు.