WGL: నగరంలో జనరల్ ఫండ్‌తో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. వేసవి సమయంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలన్నారు.
కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. డీమార్ట్, స్మార్ట్ మీటర్లు ఇనిస్టాలేషన్, ఎక్షమో, ఆక్వా ఎక్స్ పోర్టు తదితర సంస్థల్లో పని చేసేందుకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 18-32 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు హాజరు కావాలన్నారు.
VZM: ఈ నెల 28న వంగర మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశ జరగనుందని MPP ఉత్తరావెల్లి సురేశ్ ముఖర్జీ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక MPDO కార్యాలయంలో మాట్లాడుతూ… శనివారం ఉదయం 10:30 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుందన్నారు. అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సమగ్ర అభివృద్ధి నివేదికలతో రావాలని సూచించారు.
MHBD: విద్యార్థులు పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగే సతీష్ గౌడ్ అన్నారు. గూడూరు మండలం బ్రాహ్మణపల్లిలోని కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల విద్యాలయంలో ఇంటర్ విద్యార్థులకు పెన్నులు, పరీక్ష ఫ్యాడ్లు పంపిణీ చేశారు. పరీక్షలంటే విద్యార్థులు భయం, ఆందోళన విడాలని పేర్కొన్నారు.
MBNR: బీఆర్ఎస్ నేత ఒకరు ఎస్సీ, ఎస్టీలకు చెందిన 600 ఎకరాల భూమిని కబ్జా చేశారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం ఆరోపించారు. కొండకల్, మోకిల ప్రాంతాల్లో 1,100 ఎకరాల గిరిజనుల భూములు కొట్టేసిన వారు త్వరలోనే జైలుకు వెళ్తారని హెచ్చరించారు. త్వరలోనే వీటికి సంబంధించిన ఆధారాలు బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.
MDCL: ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దని డాక్టర్ సువర్ణ, డాక్టర్ రమణ మహర్షి తెలిపారు. బాలానగర్, ప్రకాష్ నగర్, సూరారం సహా అనేక ప్రాంతాల్లో వివిధ ప్రజారోగ్య సంస్థలు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాయి. వృద్ధులు, యుక్త వయసు, చిన్నపిల్లలు సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు.
కడప: అంబేద్కర్ సర్కిల్ వద్ద సోమవారం రాత్రి చిన్నచౌక్ ఎస్సై రాజరాజేశ్వర రెడ్డి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చినా.. మోడిఫైడ్ సైలెన్సర్లు వాడినా.. వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు.
ATP: జిల్లాలో మార్చి నెల పింఛన్లను ఈ నెల 28వ తేదీనే పంపిణీ చేయనున్నారు. మార్చి 1 ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే నగదు అందజేయాలని నిర్ణయించింది. జిల్లాలోని 2.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.123 కోట్లు పంపిణీ కానున్నాయి. ఆ రోజున అందుకోలేని వారు మార్చి 2న సచివాలయాల్లో తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో గణపవరం, భీమడోలు నారాయణపురం జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గణపవరం సీఐ రజిని కుమార్ పర్యవేక్షణలో పోలీసులున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు పేర్కొన్నారు.
విశాఖ: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విశాఖలోని జగదాంబ జంక్షన్, పూర్ణా మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ప్రాంతాల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికుల పనితీరును ప్రశంసిస్తూ, అంకితభావంతో కొనసాగించాలని సూచించారు. వీధి దీపాల నిర్వహణ, వ్యర్థాల సేకరణను బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
NTR: మైనర్ బాలికను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరుకి చెందిన హేమంత్ సాయి కొత్తపేటకు చెందిన ఓ బాలిక(16)ను మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. ఈ మేరకు ఈ నెల 19న కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ కొండలరావు తెలిపారు.
KMR: నిజాంసాగర్ మండలం చిన్నకొడప్గల్ గ్రామంలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో నేడు బిఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే హనుమాన్ సిండే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిఆర్ఎస్ మద్దతు సర్పంచ్ ఎన్నికలు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశానికి హాజరు కావాలన్నారు.
ప్రకాశం: జిల్లాలో రబీ 2025-26 సీజన్‌కు అన్నిపంటలకు అవసరమైన మేర యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. యూరియా 34,878 మెట్రిక్ టన్నుల ఎరువు పంపిణీ ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. రైతులు కొనుగోలు చేయు సమయంలో బస్తాపై ముద్రించిన MRP ధరలను చూసుకుని దాని ప్రకారం పైకం చెల్లించి డీలర్ నుంచి రసీదు పొందాలన్నారు.
EG: నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీని సోమవారం సాయంత్రం ఏపీ రాష్ట్ర BJP అధ్యక్షుడు పీ.వీ.ఎన్. మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. యూనివర్సిటీ సందర్శించిన ఆయన వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వీసీతో చర్చించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో చేపట్టిన ప్రగతి పనులను మాధవు వీసీ వివరించారు.
AP: పోలవరం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. రంపచోడవరం మండలం రంప, మర్రివాడ అటవీ ప్రాంతంలో పులి సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ సిబ్బంది ఇటీవల మండపేట సమీపంలో పులిని పట్టుకుని విశాఖ జూలో వదిలిపెట్టారు. ఈనెల 19న దేవీపట్నం-పాపికొండలు అభయారణ్యంలో అధికారులు పులిని వదిలారు. రామన్నవలస, రంపలో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు.