• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

స్పోర్ట్స్ మీట్‌లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రతిభ

సత్యసాయి: విజయవాడలో గురువారం రాత్రి జరిగిన ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్-2026లో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. జావెలిన్ త్రో పోటీలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచి విజేతగా నిలిచారు. టెన్నిస్ డబుల్స్, టికిల్ బాల్ పోటీల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి బరిలోకి దిగి విజయం సాధించారు.

February 27, 2026 / 05:30 AM IST

పేకాట శిబిరంపై దాడి. 20 మంది అరెస్ట్

కోనసీమ: మామిడికుదురు మండలం పాసర్లపూడి బాడవ గురువారం సాయంత్రం పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్సై చైతన్య కుమార్ తన సిబ్బందితో కలిసి దాడి చేసి పేకాట ఆడుతున్న 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 32 వేల నగదు, 8 మోటార్ సైకిళ్లు, 19 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

February 27, 2026 / 05:30 AM IST

ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ: కలెక్టర్

KKD: మార్చి నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే అంటే ఈనెల 28న జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేస్తామని కలెక్టర్ షన్మోహన్ గురువారం తెలిపారు. 2.68 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 117.02 కోట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం నాడే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.

February 27, 2026 / 05:30 AM IST

కడప జిల్లా జేఏసీ సెక్రటరీ జనరల్‌గా మహేష్ బాబు

కడప ఎన్జీవో భవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో జిల్లా జేఏసీ ఛైర్మన్‌గా బి. శ్రీనివాసులు, సెక్రటరీ జనరల్‌గా యూటీఎఫ్ నేత పాలెం మహేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మహేష్ బాబు విమర్శించారు.పెండింగ్ సమస్యల పరిష్కారానికి జేఏసీ ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

February 27, 2026 / 05:27 AM IST

INSPIRATION: చంద్రశేఖర్ ఆజాద్

భారత స్వాతంత్ర్యోద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్ ఓ ధృవతార. అజేయ సాహసానికి, దేశభక్తికి నిలువుటద్దం. 15 ఏళ్ల వయుసులోనే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన.. న్యాయస్థానంలో పేరు అడిగితే ‘ఆజాద్(స్వేచ్ఛ)’, అని తన తండ్రి ‘స్వతంత్ర’ అని గంభీరంగా సమాధానమిచ్చారు. ప్రతి కొరడా దెబ్బకూ ‘వందేమాతరం’ అన్న నినాదంతో నాటి బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించారు.

February 27, 2026 / 05:15 AM IST

నాలుగో రోజుకు చేరిన అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు

అన్నమయ్య: మదనపల్లెలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని వారు ఆరోపించారు.

February 27, 2026 / 05:14 AM IST

కర్నూలులో హత్య కేసులో నలుగురు అరెస్ట్

KRNL: ఖండేరి వీధికి చెందిన మనోహర్ (40) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 22న పాత బస్టాండ్ సమీపంలోని బార్ వద్ద జరిగిన గొడవలో తెలుగు నగేశ్, తెలుగు రాజు, ఎరుకలి రాముడు, తెలుగు ఈరన్న కత్తులు, కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ తెలిపారు. నిందితుల నుంచి ఆటో, రెండు కత్తులు స్వాధీనం చేసి రిమాండ్‌కు పంపారు.

February 27, 2026 / 05:14 AM IST

రోడ్డు ప్రమాదంలో బి. కొత్తకోట యువకుడు మృతి

అన్నమయ్య: కర్ణాటకలోని హోస్కోట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగుట్లపల్లికి చెందిన శ్రీహరి (27) దుర్మరణం చెందారు. బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న శ్రీహరి, స్వగ్రామంలో పనులు ముగించుకుని బైక్‌పై బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కొడుకు మృతితో నల్లగుట్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

February 27, 2026 / 05:10 AM IST

విద్యుత్ షాక్ తగిలి గేదె మృతి

MDK: విద్యుత్ షాక్ తగిలి దున్నపోతు మృతి చెందిన ఘటన శంకరంపేట మండలం తిరుమలాపూర్‌లో గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి బుజమ్మకు చెందిన గేదె పొలంలో మేత మేస్తూ విద్యుత్ స్తంభానికి ఉన్న సపోర్ట్ తీగ తగిలి విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సుమారు రూ.40 వేల ఆస్తి నష్టం జరిగిందని బుజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

February 27, 2026 / 04:57 AM IST

సీఐ, అడ్వకేట్ మధ్య వార్ ముగింపు

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరాకు అడ్వకేట్ పవన్ కుమార్ వినతి పత్రం అందజేశారు. ఫిబ్రవరి 21న 4వ పట్టణ సీఐ విక్రమ సింహాతో జరిగిన వివాదాన్ని పరస్పర చర్చలతో సఖ్యంగా పరిష్కరించుకున్నామని, ఎవరి ప్రమేయం లేదని, ఎవరిపై చర్యలు తీసుకోవద్దని లిఖితపూర్వకంగా కోరారు. ఈ అంశం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

February 27, 2026 / 04:35 AM IST

వెలుగోడులో పుచ్చకాయలకు పెరిగిన డిమాండ్

NDL: ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయల అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే వెలుగోడులో వేసవికి కొన్ని రోజుల ముందే పుచ్చకాయలు వచ్చినప్పటికీ వాటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కొక్క పుచ్చకాయ ధర రూ.160 నుంచి రూ.240 వరకు ఉండటంతో ప్రజలు కొనుగోలు చేయడానికి బెంబేలెత్తి పోతున్నారు.

February 27, 2026 / 04:13 AM IST

264 మంది పోకిరీల పట్టివేత

TG: షీ టీమ్స్, CC కెమెరాలతో ఎక్కడికక్కడ నిఘా పెట్టినా పోకిరీల తీరు మారట్లేదు. రద్దీ ఎక్కువగా ఉంటే ప్రాంతాల్లో మహిళలు, యువతుల్ని అసభ్యంగా తాకుతూ రాక్షసానందం పొందుతున్నారు. HYD నుమాయిష్‌లో ఇలా చేస్తూ 260 మంది పోకిరీలు చిక్కారు. వీరిలో 22 మంది మైనర్లూ ఉండటం గమనార్హం. 188 పోకిరీలకు కౌన్సిలింగ్ ఇవ్వగా, 52 మందికి జరిమానా.. మరో నలుగురికి 2 రోజుల జైలు+జరిమానా విధించారు.

February 27, 2026 / 02:20 AM IST

ఏప్రిల్ 1 నుంచి మూడో డిస్కం ప్రారంభం

TG: రాష్ట్ర ప్రభుత్వం మూడో డిస్కంను ఏప్రిల్ 1న ప్రారంభించనుంది. సుమారు 30 లక్షల సర్వీస్ కలెక్షన్లతో ఈ డిస్కం ఏర్పాటవగా.. దీనికే వ్యవసాయ ఉచిత విద్యుత్, మెట్రో వాటర్ బోర్డ్, లిఫ్ట్ ఇరిగేషన్ సరఫరాను బదిలి చేసింది. ఇప్పటికే పవర్ అంబులెన్సులతో ఔటేజ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టగా.. ఫీడర్ ఔటేజ్ మెనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ ఏర్పాటుచేసింది.

February 27, 2026 / 01:20 AM IST

ఇంకా డేంజర్ జోన్‌లోనే టీమిండియా

జింబాబ్వేపై విజయంతో భారత్ T20 WC సెమీస్ ఆశలను నిలుపుకుంది. అయితే అసలు డేంజర్ ముందే ఉంది. దూకుడుగా ఆడుతున్న విండీస్‌పై మార్చి 1న గెలిస్తేనే భారత్ సెమీస్‌కు చేరుతుంది. ఇరుజట్లకూ కీలకమైన ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్ వర్షంతో రద్దయితే.. మెరుగైన రన్‌రేట్ కలిగిన విండీస్ ముందుకు వెళ్తుంది. ఇలా ఓడినా, వర్షం పడినా డిఫెండింగ్ ఛాంప్ భారత్ ఖాళీ చేతులతో నిష్క్రమించాల్సిందే.

February 27, 2026 / 12:20 AM IST

ఫిబ్రవరి 27: చరిత్రలో ఈరోజు

➢ 1931: స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ మరణం➢ 1932: కవి, బహుభాషావేత్త వేగె నాగేశ్వరరావు జననం➢ 1956: లోక్‌సభ తొలి స్పీకర్ జీవీ మావలాంకర్ మరణం➢ 2002: సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనం.. 59 మంది VHP కరసేవకులు మృతి➢ 2019: చిత్ర నటి, దర్శకురాలు విజయ నిర్మల మరణం

February 27, 2026 / 12:00 AM IST