• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం’

MBNR: ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని హన్వాడ మండల ఎస్సై వెంకటేష్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎస్సై హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు మద్యం తాగి ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలు నడపకూడదన్నారు. పోలీసులకు సహకరించాలన్నారు.

February 28, 2026 / 01:17 PM IST

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కౌన్సిలర్

NZB: బోధన్ పట్టణంలోని శంకర్ నగర్ (22వ వార్డు)లో కౌన్సిలర్ మిద్దెల రామరాజు శనివారం పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ జవాన్ మహబూబ్‌తో కలిసి వార్డు అంతటా తిరుగుతూ పారిశుద్ధ్య నిర్వహణను పర్య వేక్షించారు. వార్డును ఆదర్శంగా, పరిశుభ్రంగా ఉంచడమే తమ లక్ష్యమని, ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని కోరారు.

February 28, 2026 / 01:17 PM IST

నాని, పవన్, ప్రభాస్‌లతో సుజీత్..!

నాని, సుజీత్ కాంబోలో వస్తున్న ‘బ్లడీ రోమియో’పై అంచనాలు పెరిగిపోయాయి. సుజీత్ తాజాగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, నానిల ఫోటోను షేర్ చేయడంతో తన ‘సినిమాటిక్ యూనివర్స్’పై హింట్ ఇచ్చినట్లయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గనుక ‘సాహో’, ‘OG’ సినిమాలతో లింక్ అయితే నాని కెరీర్‌లోనే భారీ హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం. ఈ అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.

February 28, 2026 / 01:17 PM IST

కడపలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KDP: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మాధవి రెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని 31వ డివిజన్ పరిధిలో పాత మహిళా పోలీస్ స్టేషన్ సమీపంలో ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పింఛన్లను అందజేసి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 01:17 PM IST

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: MLA

RR: శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీీవి.ఆర్ గార్డెన్ వద్ద నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి అర్హుడికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:16 PM IST

కవితకు న్యాయం జరిగింది: కేసీఆర్

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసును కోర్టు కొట్టేసిన నేపథ్యంలో BRS అధినేత, మాజీ సీఎం KCR కీలక వ్యాఖ్యలు చేశారు. కవితకు న్యాయం జరిగిందని, BRS కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఎప్పుడైనా చివరికి న్యాయమే గెలుస్తుందన్నారు. లిక్కర్ కేసులో BJP కుట్ర పన్నిందని ఆరోపించారు. అలాగే, రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై KTRతో చర్చించినట్లు తెలుస్తోంది.

February 28, 2026 / 01:16 PM IST

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ…

SDPT: చిన్నకోడూరు మండలంలోని మేడిపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బోధనలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:16 PM IST

సత్యనారాయణ స్వామిని దర్శించ్చుకున్న ఎంపీ

KRNL: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇవాళ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎంపీకి అధికారులు, అర్చకులు సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ టీఏసీ సభ్యులు బత్తిన జీవన్ కుమార్, చంద్రశేఖర్ ఉన్నారు.

February 28, 2026 / 01:14 PM IST

మచ్చ బొల్లారం మార్కెట్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు

MDCL: అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం మార్కెట్ రోడ్డులో ఫుట్‌పాత్‌లపై జరిగిన ఆక్రమణలను ట్రాఫిక్, మున్సిపల్, పోలీస్ అధికారులు సంయుక్తంగా తొలగించారు. రహదారిపై అనధికారికంగా ఏర్పాటు చేసిన షెడ్లు, వ్యాపార స్టాళ్లు, ఇతర వస్తువులను తొలగిస్తూ పాదచారులకు సౌకర్యవంతమైన మార్గం కల్పించారు. మార్కెట్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ చర్యలని అధికారుల తెలిపారు.

February 28, 2026 / 01:14 PM IST

పింఛన్ పంపిణీపై ప్రెస్‌మీట్..!

KRNL: మనేకుర్తి గ్రామంలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ప్రెస్‌మీట్ ఇవాళ నిర్వహించారు. పేదలు,వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రతి అర్హుడికి పారదర్శకంగా, సమయానికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమనిన్నారు.

February 28, 2026 / 01:13 PM IST

తనపల్లి రహదారి పనులు.. బస్సుల మార్గమార్పు

తిరుపతి రూరల్ తనపల్లి వద్ద జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్టీసీ అధికారులు TPT సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి చిత్తూరు, కాణిపాకం, బెంగళూరు వెళ్లే బస్సులను దారి మళ్లించారు. ఇవి ఇకపై తిరుమల బైపాస్ రోడ్డు అలిపిరి–టౌన్ క్లబ్ మార్గంగా హైవేపైకి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

February 28, 2026 / 01:13 PM IST

‘ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు’

BDK: ఏజెన్సీ ఏరియాలో గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని గోండ్వానా సంక్షేమ పరిషత్ చర్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వరప్రసాద్ ఆరోపించారు. శనివారం కొయ్యూరు గ్రామంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. చర్ల మండలం కేంద్రంలో ఏజెన్సీ చట్టాలను గిరిజనేతరులు అతిక్రమిస్తున్న అధికారులు మౌనం పాటిస్తున్నారని చెప్పారు.

February 28, 2026 / 01:13 PM IST

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పార్వతీపురం పట్టణంలోని 14 వార్డు గొల్ల వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇవాళ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పంపిణీ చేశారు. అనంతరం ఆయన లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల మొదటి తేదీన కూటమి ప్రభుత్వం పెన్షన్ల ఇస్తుందని తెలిపారు.

February 28, 2026 / 01:13 PM IST

400 ఏళ్ల ‘గులాల్ గోటా’.. మీకు తెలుసా?

జైపూర్‌లో 400 ఏళ్ల నాటి ‘గులాల్ గోటా’ హోలీ సంప్రదాయం ప్రత్యేకమైనది. ఈ గులాల్ గోటాలను హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఇవి గాలిలో పగిలిపోతాయి. ప్లాస్టిక్ బెలూన్లలా కాకుండా పర్యావరణానికి అనుకూలమైనవి, హాని చేయవు. మణిహార్ కా రాస్తాకు చెందిన కళాకారులు ఈ లక్క గోటాలను తయారు చేస్తారు. వేడి నీటిలో లక్కను కరిగించి గాలి ఊది(ఫుంక్ని ద్వారా) సన్నని బంతులుగా తయారు చేస్తారు.

February 28, 2026 / 01:13 PM IST

‘గ్రామీణ స్థాయి నుంచే ఆరోగ్య వ్యవస్థను నిత్యం పర్యవేక్షించాలి’

E.G: గ్రామీణ స్థాయి నుంచి ఆరోగ్య వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించి ప్రతిష్ట పరచాలని, అప్పుడే అత్యవసర ప్రమాదాలను నివారించవచ్చని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ తెలిపారు. శనివారం రాజమండ్రిలో కల్తీ పాల వల్ల ప్రమాద బాధితులను పరామర్శించారు. కల్తీ పాల సంఘటనలో మరణించిన వారికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

February 28, 2026 / 01:11 PM IST