MHBD: గూడూరు మండలం రాములు తండాకు చెందిన భానోత్ నరసింహ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని వాగు నుంచి బయటకు తీసి మార్చురీకి తరలించారు.
W.G: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి, తమ ఫిర్యాదులను నేరుగా వన్ టౌన్ స్టేషన్‌కు రావాలన్నారు.
TG: ఇరాన్‌పై జరుగుతున్న దాడులను MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ‘ఖమేనీని హత్య చేయడం అమానుషం. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే. యుద్ధం ఆపేసి శాంతి చర్చలు ప్రారంభించాలి. ఇందులో భారత్ కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. దాడిలో స్కూల్ పిల్లలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. యుద్ధం కొనసాగితే చమురు ధరలు పెరిగి సామాన్యులపై ప్రభావం పడే అవకాశం ఉంది’ అని అన్నారు.
నాగర్కర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తూడుకుర్తికి చెందిన బోనగళ్ల నాగ మశన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలన్నారు.
WGL: నల్లబెల్లి(M)కేంద్రంలోని ముచ్చింపుల గ్రామంలో ఆదివారం రూ.10 లక్షల వ్యయంతో CC రోడ్ల నిర్మాణానికి MLA దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మంచి రహదారులు ఉంటే గ్రామ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్ పాల్గొన్నారు.
AP: రాజధాని అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. రూ.165 కోట్లతో అకాడమీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. మరోవైపు అమరావతిలో హైకోర్టు జడ్జిల అతిథిగృహానికి సీజేఐ శంకుస్థాపన చేశారు.
NLR: జిల్లాలో మహిళల భద్రతే లక్ష్యంగా నెల్లూరు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు శక్తి యాప్‌పై పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో శక్తి బృందాలు పర్యటిస్తూ మహిళలు, విద్యార్థినులు ఈ యాప్ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆపద సమయంలో యాప్ ద్వారా పోలీసుల తక్షణ సహాయం పొందవచ్చన్నారు.
ఏలూరు జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ప్రజలు ప్రత్యక్షంగా హాజరై లేదా https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.
కృష్ణా: అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని MLA యార్లగడ్డ వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు తాగునీరు, టాయిలెట్లు, టీవీ, ఆర్వో సౌకర్యాలు కల్పించడంతో పాటు 58,204 మంది వర్కర్లకు 5జీ స్మార్ట్‌ఫోన్లు అందించామని తెలిపారు. మినీ కేంద్రాలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పిస్తామన్నారు.
CTR: కాణిపాకం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్‌లో 18.60 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి, భవిష్యత్తు అవసరాలు, ధ్యాన మందిరం ఏర్పాటు తదితర వాటికి దీనిని ఉపయోగించనున్నట్టు సమాచారం.
NZB: కమ్మర్పల్లి మండలం హసకొత్తూర్లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 100 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్ అందజేశారు. మోతి బిందు ఉన్న 22 మంది రోగులను కంటి ఆపరేషన్స్‌కు ఎంపిక చేసి గురువారం ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు.
ATP: కళ్యాణదుర్గం పరిధిలోని గువనపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు ముదిగలకు చెందిన సోదరీసోదరులు చంద్రకళ (32), శివకుమార్ (36), హనుమంత రాయుడు (40)గా గుర్తించారు. కర్ణాటకలోని మొలకల్మూరులో వివాహానికి వెళ్లి వస్తుండగా, అనంతపురం నుంచి రాయదుర్గం వెళ్తున్న బస్సు వీరి కారును ఢీకొంది.
MNCL: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లి మండలం మాలగురిజాలలో ఆదివారం మహిళల సమస్యలు పరిష్కారాలు అంశంపై సదస్సు నిర్వహించారు. AIDWA రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశలత పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమం గాలికి వదిలేసిన ప్రస్తుత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలు పోరాటంలోకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాన్నారు.