NGKL: రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఏటిగడ్డ నరసింహా రెడ్డి- రెడ్డి కన్వెన్షన్’ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం ఈ కార్యక్రమానికి MLC కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు రెడ్డి సేవా సమితి ద్వారా నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు.
KMR: పల్వంచ మండలం వేల్పుగొండలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం ఐదేళ్ల బాలుడు ట్రాక్టర్‌పై ఆడుకుంటున్నాడు. తాళం చెవి ట్రాక్టర్‌కు ఉండటంతో దాన్ని స్టార్ట్ చేశాడు. వెనుక గేర్‌లో ఉండటంతో ఒక్కసారిగి వెనక్కి కదిలి ట్రాక్టర్ టైర్లు బాలరాజు ఛాతీపై నుంచి వెళ్లగా తీవ్రగాయాలయ్యాయి. అనంతరం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
NRPT: నారాయణపేట మండలం అంతారం ఆశ్రమంలో 510వ శివరామనామ జప యజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. సంజీవయ్య, జగదీశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో మొదటిరోజైన శనివారం భక్తులు దంపతులతో కలిసి పాల్గొన్నారు. సోమవారం వరకు జరిగే ఈ యజ్ఞంలో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. గ్రామ కార్యకర్తలు రమేశ్, ఆనంద్, శ్రీను ఏర్పాట్లను పర్యవేక్షించారు.
PPM: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్లు, సిబ్బంది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో తొలిసారిగా రెండుసార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదేనన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కృషి చేస్తోందన్నారు.
JN: పాలకుర్తి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎల్లబోయిన చరణ్ స్టేషన్ ఘనపూర్లో నిర్వహించిన జిల్లా స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చరణ్‌ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
ASR: కొయ్యూరు మండలం చింతాలమ్మ ఘాట్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేంద్రపాలెం వీఆర్వో సత్యనారాయణ, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సత్యనారాయణ, తన కుమారుడుతో కలిసి బైక్‌పై కేడీపేట వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని వాహనదారులు తెలిపారు. గమనించిన వాహనదారులు గాయపడిన ఇద్దరిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
వరలక్ష్మి శరత్ కుమార్ నటించడం ఆమె తండ్రి శరత్ కుమార్‌కు ఇష్టం లేదని రాధికా తెలిపింది. ‘సరస్వతి’ మూవీ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. వరలక్ష్మిని నటిగా తీసుకోవద్దని నిర్మాతలకు కూడా ఆయన చెప్పారని గుర్తు చేసుకుంది. వరలక్ష్మి నటన చూసి ఆమె గొప్ప నటి అవుతుందని చెప్పానని తెలిపింది, అంతేకాదు తెలుగు సినిమాపై దృష్టి పెట్టమని ఆమెకు సలహా ఇచ్చినట్లు పేర్కొంది.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. అయితే, దక్షిణాఫ్రికాతో ఓడిపోయినప్పటికీ విండీస్ జట్టు మంచి ఫామ్‌లోనే ఉంది. హిట్టర్లతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ భీకరంగా కనిపిస్తోంది. ఓపెనర్ల నుంచి ఆఖరి స్థానంలో వచ్చే ప్లేయర్ వరకు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఆఖరి వికెట్ తీసేంతవరకు భారత బౌలర్లు పంజుకోవాల్సి ఉంది.
NDL: బేతంచెర్ల డోన్ రహదారిలో రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్యాక్టరీ కార్మికుడు ప్రహ్లాద (27)చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఇవాళ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నాపరాళ్ల ఫ్యాక్టరీలో పనిచేస్తూ బేతంచెర్లకు వస్తుండగా రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయాల తీవ్రతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రహ్లాద మృతిచెందాడు.
SRPT: హోలీ పండుగను ఆనందంగా, బాధ్యతగా జరుపుకోవాలని ఎస్పీ కె. నరసింహ ప్రజలను కోరారు. ఇష్టపడని వారిపై బలవంతంగా రంగులు చల్లకూడదన్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, గుంపులుగా వాహనాలతో తిరిగినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రసాయన రంగులకు బదులు సహజ రంగులు వాడాలని సూచించారు.
MHBD: తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్‌లో సెల్ ఫోన్ల దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. బస్టాండ్‌లో దొంగలు ఉన్నారనే సూచనలు చేపట్టాల్సిన ఆర్టీసీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్ ఆవరణంలో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
NRML: లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ గ్రామాభివృద్ధిలో భాగంగా భీమన్న ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ ఆదివారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ, దేవాదాయ శాఖ CGF ద్వారా మంజూరైన రూ. 25 లక్షల నిధులతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
KDP: రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ టీచర్లుగా ప్రమోషన్లు, పూర్తిస్థాయి వేతనాలు ఇస్తామన్నారు. అమరావతిలో అంగన్వాడీలతో ఆమె సమావేశమయ్యారు. వేతనాల పెంపు డిమాండ్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
NTR: కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. మాచవరం కు చెందిన బజినున్నీసా కిషోర్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇరువురు పిల్లలు ఉన్నారు. కాగా శనివారం రాత్రి వీరి ఇరువురికి వివాదం చోటు చేసుకుంది. మనస్థాపంతో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై దుర్గ భవాని కేసు నమోదు చేశారు.
AKP: ఏపీ సర్వేయర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా ఆర్ఎస్ అప్పారావు ఉపాధ్యక్షుడిగా ఐ శ్రీను, కార్యదర్శిగా సిహెచ్ ఉమా మహేష్, సంయుక్త కార్యదర్శులుగా పి.రవి ప్రసాద్, జగన్నాథం ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎస్ మోహన్, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా ఎం ప్రశాంత్ సాయిని ఎన్నుకున్నారు.