• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రసన్న కాకాణిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే

NLR: వైసీపీ నాయకుల దగ్గర డబ్బులు లేక అడుక్కుని రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విమర్శించారు. కొడవలూరులో ఆమె మాట్లాడారు. మంత్రిగా ఉన్న సమయంలో నియోజవర్గంలో అడుగుపెట్టని కాకాణి తాము డబ్బులు ఉన్న వాళ్ళమ్మని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ కుటుంబం నుంచి కూడా రాజకీయాల్లోకి మహిళా వస్తుందని గుర్తుపెట్టుకుని మాట్లాడాలన్నారు.

February 28, 2026 / 08:03 PM IST

పేలుడు ఘటన.. స్పందించిన వైద్యురాలు

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు స్పందించారు. 9 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారని, అందులో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని వెల్లడించారు. బాధితులందరికీ చికిత్స అందిస్తున్నామని, వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని స్పష్టం చేశారు. అత్యవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తామని తెలిపారు.

February 28, 2026 / 08:02 PM IST

రామేశ్వర్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

KMR: భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సర్పంచ్ చేపూరి రాణి-రాజు, ఉప సర్పంచ్ వినోద్ గౌడ్, వీడీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

February 28, 2026 / 08:02 PM IST

క్షత్రగాత్రులను పరామర్శించిన ఎంపీ

KKD: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పరామర్శించారు. ప్రతి బాధితుడి పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలంటూ వైద్యులను స్పష్టంగా ఆదేశించారు.

February 28, 2026 / 08:02 PM IST

‘ఇతరుల హక్కులకు భంగం కలిగించవద్దు’

NLG: చిట్యాల మండలం వట్టిమర్తిలో శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని సూచించారు. విద్యార్థులు అంబేద్కర్ ఆశయాలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. జీపీవో శాంతి, సర్పంచ్ మేడి శ్రీలత పాల్గొన్నారు.

February 28, 2026 / 08:01 PM IST

‘ప్రజలు సంతృప్తి చెందే దిశగా వైద్య సేవలందించాలి’

PPM: ఆసుపత్రికి వచ్చే రోగుల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని, తిరిగి వారు సంతృప్తి వ్యక్తం చేసే దిశగా వైద్య సేవలు అందించాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. జగన్నాధపురం పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. తొలుత హెచ్.పి.వి వ్యాక్సిన్ లాంచింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వైద్య అధికారులు, సిబ్బందితో కలిసి వీక్షించారు.

February 28, 2026 / 08:00 PM IST

క్రియాశీల సభ్యత్వంపై జనసేన సమావేశం

VSP: జనసేన పార్టీ నగర కార్యాలయంలో క్రియాశీల (ఉద్యమి) సభ్యత్వ నమోదుపై శనివారం ముఖ్య సమావేశం జరిగింది. నగర (పార్లమెంట్) అధ్యక్షుడు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తూర్పు, ఉత్తర నియోజకవర్గాల నాయకులతో చర్చించారు. సభ్యత్వంపై కార్యకర్తల సందేహాలు తెలుసుకుని నివృత్తి చేశారు. ప్రతి కార్యకర్త ఉద్యమి సభ్యత్వాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలన్నారు.

February 28, 2026 / 08:00 PM IST

కిడ్నీ బాధితులకు అండగా ఎమ్మెల్యే శిరీషాదేవి

ASR: ఉర్లకులపాడులో కిడ్నీ బాధితులను ఎమ్మెల్యే శిరీషాదేవి పరామర్శించారు. ఇక్కడ ఆరుగురు మరణించినా, నీటి నమూనాలు సురక్షితమేనని, అపోహలు వద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం, గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 08:00 PM IST

జోగంపేటలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం

AKP: గొలుగొండ మండలం జోగంపేటలో ఎంపీడీవో శ్రీనివాసరావు, టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసి లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. త్వరలోనే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తుంది అన్నారు.

February 28, 2026 / 08:00 PM IST

మాదకద్రవ్యాల భద్రతకు పటిష్ట నిఘా

SKLM: జిల్లాలో పట్టుబడిన మాదక ద్రవ్యాలను అత్యంత భద్రంగా నిల్వ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. శనివారం వంశధార పాత క్వార్టర్స్‌‌లోని భవనాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, ఏఎస్పీ శ్రీనివాసరావు కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు రెవెన్యూ, పోలీస్, అధికారులు ఉన్నారు.

February 28, 2026 / 08:00 PM IST

‘తౌశిక్ మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి’

ప్రకాశం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ను పరిశీలించిన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. కోచింగ్ సెంటర్‌లో విద్యార్థి తౌశిక్ అనుమానాస్పద మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రతపై యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

February 28, 2026 / 07:58 PM IST

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష

JGL: 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసారి 4 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రూ.940 కోట్లతో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పారిశుద్ధ్యం, పార్కింగ్, నిరంతర విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

February 28, 2026 / 07:57 PM IST

ఆలం ఖాన్ పల్లిలో రూ.1.50 కోట్ల డ్రైనేజీ పనులకు శ్రీకారం

కడప నగరంలోని 50వ డివిజన్ ఆలం ఖాన్ పల్లిలో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి భూమిపూజ నిర్వహించారు. చిరకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

February 28, 2026 / 07:56 PM IST

క్రీడా పాఠశాలల అడ్మిషన్ల గోడ పత్రిక ఆవిష్కరణ

NGKL: క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి అడ్మిషన్లకు సంబంధించి గోడపత్రికను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2026-27 విద్యా సంవత్సరానికి క్రీడ పాఠశాలలో అడ్మిషన్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం క్రీడా శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

February 28, 2026 / 07:54 PM IST

99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై సీఎం సమీక్ష

TG: 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై సీఎం రేవంత్ సమావేశం నిర్వహించారు. మార్చి నుంచి జూన్ వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని  అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణా రెడ్డితో పాటు సీఎం సలహాదారు, డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి, ప్రజల సమస్యల తక్షణ పరిష్కారంపై ఈ ప్లాన్ దృష్టి సారించనుంది.

February 28, 2026 / 07:54 PM IST