• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు క్రీడా పోటీలు

MNCL: మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పలు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ఏరియా సింగరేణి పర్సనల్ HOD రాజేశ్వర్ రావు శనివారం తెలిపారు. మార్చ్ 5న మాదారం, 6న గోలేటిలో సాయంత్రం 4 గంటల నుండి పోటీలు జరుగుతాయన్నారు. వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న మహిళలు GM ఆఫీస్‌లో సంప్రదించాలన్నారు.

February 28, 2026 / 04:06 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

సత్యసాయి: పరిగి మండలం కోడిగేనహళ్లి గ్రామంలో పరిగి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6,88,868 విలువైన చెక్కులను మంత్రి సవిత శనివారం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 04:06 PM IST

మూడు రోజుల్లో త్రాగునీటి సమస్యకు పరిష్కారం

AKP: టిడ్కో కాలనీలో తాగునీటి సమస్య లేకుండా చూస్తామని యలమంచిలి మున్సిపల్ డిప్యూటీ డీఈఈ కనకరాజు అన్నారు. పట్టణంలో రాంనగర్ సమీపంలో గల టిడ్కో కాలనీలో సీ1 బ్లాక్లో మంచినీటి సమస్యపై ఫిర్యాదు రావడంతో శనివారం పర్యటించారు. శుద్ధ వాటర్ కారణంగా పైపులు జాము అయ్యాయని, మూడు రోజుల్లో ఈ పనులు చేయించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

February 28, 2026 / 04:05 PM IST

‘స్కూల్ విద్యార్థుల ప్రయాణ భద్రతే ముఖ్యం

PPM: విద్యార్థుల భద్రతే ముఖ్యం అని ఎంవీఐ వేణుగోపాలరావు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు, ఏఎస్పీ మనీషా రెడ్డి ఉత్తర్వులతో శనివారం స్కూల్ బస్సు డ్రైవర్లకు పాలకొండలో అవగాహన కల్పించారు. విద్యార్థుల ప్రాణాలు తమ చేతుల్లో ఉన్నాయని డ్రైవర్లకు భాద్యతాయుతంగా వ్యవహరించాలని ఎంవీఐ సూచించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని ఎంవిఐ హెచ్చరించారు.

February 28, 2026 / 04:05 PM IST

‘ఆసక్తి కలిగించే విధంగా బోధన అందించాలి’

ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఎర్రగుంట గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ శనివారం సందరర్శించారు. ఈ సందర్బంగా పాఠశాలలోని బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆసక్తి కలిగించే విధంగా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

February 28, 2026 / 04:04 PM IST

కేంద్రం మనకు సహకరిస్తోంది: చంద్రబాబు

AP: ప్రజలు కట్టబెట్టిన భారీ మెజార్టీతో కేంద్రంలో తమ పరపతి పెరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. చీపురుపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రం కూడా మనకు సహకరిస్తోంది. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం. విజయనగరం జిల్లా నీటి కష్టాలు తీరుస్తున్నాం. విజయనగరం పండ్ల తోటలకు కేంద్రంగా మారాలి. అన్నదాత సుఖీభవ ఇస్తామని హామీ ఇచ్చాం.. మాట నిలబెట్టుకున్నాం’ అని పేర్కొన్నారు.

February 28, 2026 / 04:02 PM IST

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

TPT: తిరుపతి నగరంలోని పెద్దకాపు లేఅవుట్‌లో విషాదం నెలకొంది. కేవీపల్లె మండలం నూతన కాలువ గ్రామం దిన్నెవడ్డేపల్లికి చెందిన చెంచయ్య(40) నూతన భవన నిర్మాణ పనులకు వచ్చాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈస్ట్ ఎస్సై రామస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 28, 2026 / 04:02 PM IST

జడ్పీ హైస్కూల్లో సైన్స్ దినోత్సవం

WNP: మదనాపురం మండలంలోని జడ్పీ హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. విజ్ఞానం పుస్తకాలకే పరిమితం కాదని చాటుతూ కళాకారుడు విద్యార్థుల ముందే కుమ్మరి చక్రంపై మట్టి పాత్రలు తయారు చేసి చూపించారు. మట్టిని కుండలుగా మార్చే విధానం విద్యార్థులను ఆకట్టుకుంది. సైన్స్ మన దైనందిన జీవితంలో భాగమని హెచ్ఎం మహేందర్ గౌడ్ తెలిపారు.

February 28, 2026 / 04:02 PM IST

ప్రధాని ఆశీర్వాదం తీసుకున్నాం: విజయ్‌

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలవడంపై నటుడు విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశాడు. మోదీ ఆశీస్సులు తీసుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని, తన తల్లిదండ్రులకు ఆయన లేఖ రాయడం విశేషమని పేర్కొన్నాడు. అమిత్ షాతో సినిమా, సంస్కృతిపై చర్చించానని.. ఆయన కానుకగా ఇచ్చిన గణేష్ విగ్రహాన్ని తమ పూజా గదిలో ఉంచామని తెలిపాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

February 28, 2026 / 04:02 PM IST

‘నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి’

కోనసీమ: నిరుద్యోగ యువత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ సూచించారు. ఇవాళ మల్కిపురంలోని డిగ్రీ కళాశాల వద్ద అధికారులు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎమ్మెల్యే సందర్శించి నిరుద్యోగులకు ఉపాధి పొందే అవకాశాలపై అవగాహన కల్పించారు.

February 28, 2026 / 04:01 PM IST

ఏపూరు హై స్కూల్లో సైన్స్ దినోత్సవం

NLG: చిట్యాల మండలం ఏపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మహేష్ సైన్స్ ప్రదర్శనలను ప్రారంభించారు. విద్యార్థులు న్యూటన్ నియమాలు, పాస్కల్ సూత్రం, గ్రీన్ ఎనర్జీ వంటి పలు వర్కింగ్ మోడల్స్‌ను ప్రదర్శించారు. సీవీ రామన్ సేవలను హెచ్ఎం మోహన్ రెడ్డి, ఫిజికల్ సైన్స్ టీచర్ గోపాల్ రెడ్డి కొనియాడారు.

February 28, 2026 / 04:01 PM IST

విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసిన సబ్ కలెక్టర్

KMR: జుక్కల్ మండలం పెద్ద ఏడ్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం చేసి, వంటల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, మెనూ ప్రకారం వారంలో మూడు రోజులు తప్పనిసరిగా గుడ్లు పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

February 28, 2026 / 04:01 PM IST

‘పరీక్ష కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలి’

ADB: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదు నెలల ఉచిత రెసిడెన్షియల్ పరీక్ష మార్చి 1న నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేశ్ శనివారం తెలిపారు. పట్టణంలో నలంద కళాశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాలని సూచించారు.

February 28, 2026 / 04:00 PM IST

వన్ స్టాప్ సెంటర్‌ను తనిఖీ చేసిన జిల్లా జడ్జి

విజయనగరంలో ఉన్న శక్తి వన్ స్టాప్ సెంటర్‌ను జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ. కృష్ణ ప్రసాద్ శనివారం సందర్శించారు. సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలను, బాధితులకు ముఖ్యంగా మహిళా బాధితులకు ఏ విధమైన ఆశ్రయాలు కల్పిస్తున్నది వారికి ఏ విధమైన కౌన్సిలింగ్ ఇస్తున్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 04:00 PM IST

సీదిలో రూ.2.41 కోట్లతో ఇండోర్ స్టేడియంకు గ్రీన్ సిగ్నల్

SKLM: పాతపట్నం నియోజకవర్గంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో CSR నిధుల ద్వారా పాతపట్నం M.సీది గ్రామంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సూత్ర ప్రాయ ఆమోదం లభించినట్లు స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.2.41 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు.

February 28, 2026 / 04:00 PM IST