GNTR: అమరావతిలోని శాసనసభను సందర్శించిన 19 పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ముచ్చటించడం ఆనందంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంచుకోవడానికి వచ్చిన చిన్నారుల కుతూహలం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. సభ విరామ సమయంలో విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
ELR: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంకు చెందిన ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుంకర సత్తిరాజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం పండించాలనే సంకల్పంతో ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆకుకూరలు, కూరగాయలను పండించడం జరుగుతుందన్నారు.
MDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలో గ్రామ, మండల స్థాయి సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 12 వరకు కొనసాగే ఈ ప్రత్యేక ప్రణాళికలో సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు.
AP: రేణిగుంట విమానాశ్రయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ‘జై ఆంధ్రా’ అంటూ కవిత నినాదం చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టి 4 నెలలు వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. శ్రీవారి దయతో సత్యం తన వైపు ఉండటంతో.. ఆ కేసును కోర్టు కొట్టేసిందన్నారు. కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో.. స్వామి దర్శనం చేసుకునేందుకు వచ్చామన్నారు.
NDL: అవుకు పట్టణంలో ఇవాళ బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. పట్టణ సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గృహప్రవేశాన్ని ఘనంగా ప్రారంభించారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఇంటిని ఇప్పుడు ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
కోనసీమ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 9న మహిళా ఉపాధ్యాయులకు ‘ఎక్స్టెన్స్ అవార్డ్స్’ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ముమ్మిడివరంలోని ఎయిమ్స్ కళాశాల సెమినార్ హాల్లో జిల్లా విద్యాశాఖాధికారి పి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ క్యాడర్లలో ఉత్తమ సేవలు అందించిన 215 మంది ఉపాధ్యాయులను సత్కరించనున్నారు.
KRNL: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన విభాగం 2025 – 25 ఉద్యాన పంటల సాగులో నూతన సాంకేతికలపై హెచ్ఓ అపర్ణ ఆధ్వర్యంలో మంత్రాలయం డివిజన్ నుంచి 30 మంది రైతులు గురువారం రైతు విజ్ఞాన యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా అనంతపురంలోని ఉద్యాన పంటలను పరిశీలించారు. హెచ్ఓ అపర్ణ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగు రైతాంగానికి ఎంతో లాభదాయకమని స్పష్టం చేశారు.
MBNR: నవాబ్ పేట మండలం లోకిరేవుకు చెందిన సుజాతకు 108 అంబులెన్స్‌లోనే సుఖ ప్రసవమైంది. గురువారం ఉదయం నవాబ్ పేట ఆసుపత్రి నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ లక్ష్మణ్, పైలెట్ మహమూద్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవం చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వగా, ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు.
KDP: మైదుకూరుకు చెందిన 25 ఏళ్ల మహిధర్ 3 రోజుల క్రితం పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైనట్లు అతని తండ్రి మారుతి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల వద్ద కూడా లేకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి, పోలీసుల సహాయం కోరారు. మహిధర్ బ్రహ్మంగారిమఠం ప్రాంతంలో సంచారం చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
MNCL: PVYS తెలంగాణ ఆధ్వర్యంలో రూపొందించిన పాలీసెట్-2026 మోడల్ టెస్ట్ పోస్టర్లను మంచిర్యాల DEO యాదయ్య గురువారం విడుదల చేశారు. పటేల్ విద్యార్థి యువజన సంఘం నిర్వహిస్తున్న ఈ మాదిరి పరీక్షలు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
BDK: గర్భిణులు, బాలింతలు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మంజుల కోరారు. లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ భూక్యా మంజుల గురువారం తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులను, నిల్వ ఉన్న సరుకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తల్లులకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.
WGL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని నర్సంపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
నెల్లూరు: కావలి డీఎల్‌పీఓ వెంకటరమణ గురువారం విడవలూరు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని విడవలూరు, అలగానిపాడు, దండిగుంట, గాదెలదిన్నె గ్రామపంచాయతీలలో ఇంటి పన్నులు వసూలును తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పన్నులు చెల్లించాలన్నారు. గ్రామపంచాయతీకి పన్ను బకాయిలు ఉన్నవారందరూ, ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతున్నందున ఖచ్చితంగా బకాయిలు చెల్లించాలన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 899.71 పాయింట్లు లాభపడి 80015.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 285.40 పాయింట్ల లాభంతో 24765.90 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.59గా ఉంది.
AP: మాజీ సీఎం జగన్ క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా.. సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. అంతే కాకుండా చట్టసభలో శాసనమండలి ఛైర్మన్‌ను సైతం టీడీపీ నేతలు అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు.