CTR: పేకాడుతున్న పదిమందిని అరెస్టు చేసినట్లు పలమనేరు సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. పలమనేరు మున్సిపాలిటీ గొబ్బిళ్ల కోటూరు సమీపంలోని కొత్తచెరువు వద్ద పేకాడుతున్నారన్న సమాచారంతో దాడులు చేయగా, పదిమంది పట్టుబడ్డారని CI తెలిపారు. వీరి నుంచి రూ.13200 స్వాధీనం చేసుకుని, అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ తిరుపతి పట్టణానికి చెందిన రాధా కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు రూ. 1,00,000 విరాళాన్ని వారు ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను ఇచ్చారు.
KDP: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష కోసం ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు టిటిడి జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి మేళతాళాలతో స్వాగతం పలికారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మీనాతో కలిసి స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వాదంతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గద్వాల జిల్లాలో పేదరికం, నిరక్షరాస్యత కోరల్లో చిక్కుకున్న చాలా కుటుంబాలు ఉన్నాయని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ కలెక్టర్‌కు గురువారం విన్నవించారు. జిల్లాకు నూతనంగా బదిలీలు వచ్చిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ను ఆయన కలిశారు. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. సామాన్యుడికి విద్య, వైద్యం, వ్యవసాయ ఫలాలు అందేలా కృషి చేయాలన్నారు.
NRPT: ధన్వాడ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు సహకరించాలని, సర్పంచులు కీలక పాత్ర పోషించాలని సీఐ భగవంత్ రెడ్డి సూచించారు. గురువారం ధన్వాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
KMR: జిల్లా బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ షెట్కార్, వైస్ ఛైర్మన్ భాగ్యలక్ష్మిలను గురువారం టీఎన్జీవో యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ ప్రాజెక్టు సెక్రటరీ విజయలక్ష్మి, తదితరులు పాలుగోన్నారు.
KMM: సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మాజీ సీఎం సర్దార్ జలగం వెంగళరావు పేరు పెట్టారు. వెంగళరావు పేరు పెట్టేందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్‌లకు మున్సిపాలిటీ ప్రజలు, నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 1973 నుంచి 1978 వరకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా పని చేశారు.
SRPT: కోదాడ పెన్షనర్ల సంఘ భవనంలో ఈనెల 7న శనివారం నిర్వహించే మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. గురువారం కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, సంఘ సభ్యులతో కలిసి బ్రోచర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.
NLG: హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ఖాయమని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
MDK: తూప్రాన్ పట్టణం మూడో వార్డులో సీసీ రోడ్డు తొలగింపు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. మూడో వార్డులో అనుమతి లేకుండా బాలు సీసీ రోడ్డును తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. రోడ్డును తొలగించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించినట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు.
NZB: నవీపేట్ మండలం కమలాపూర్ నుంచి నిజామాబాద్ వెళ్లే రహదారిపై గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు.
MBNR: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కౌకుంట్ల మండల కేంద్రంలోని జామియా మసీదులో ముస్లిం సోదరులకు గురువారం సాయంత్రం తెలంగాణ బ్యాంకు ఉద్యోగి శ్రీనివాసులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్నీ మతాల ప్రజలు ఐక్యతతో పండుగలు జరుపుకోవాలని శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అనంతరం ముస్లిం సోదరులు బ్యాంక్ శ్రీనుకు శాలువాతో ఘనంగా సన్మానించారు.
PLD: నరసరావుపేట సమీపంలోని సాతులూరు రైల్వే స్టేషన్ వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మృతుడు కాషాయం రంగు దుస్తులు ధరించి ఉన్నారని, ఆయన భిక్షాటన చేసే వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
VSP: రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ తరాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 2050 నాటికి పట్టణ జనాభా 50%కు చేరే అవకాశముందని అన్నారు.
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దుర్గగుడి అధికారులు భక్తులకు కీలక సూచన చేశారు. ఈనెల 8వ తేదీ వరకు అమ్మవారి అంతరాలయ దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈనెల 9వ తేదీ వరకు అన్ని రకాల ఆర్జిత సేవలను సైతం రద్దు చేసినట్లు వెల్లడించారు.