• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలం’

ASF: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని KVPS జిల్లా కార్యదర్శి కార్తీక్ విమర్శించారు. గురువారం ఆసిఫాబాద్ లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చి హామీలను నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. సర్కార్ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి,రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలన్నారు.

March 5, 2026 / 08:14 PM IST

గ్రంథాలయంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు

CTR: పుంగనూరు పట్టణంలోని గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలను గ్రంథాలయ అధికారి తులసి నాయక్ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ సుబ్బరాయుడు హాజరయ్యారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత విద్యార్థినిలకు గుడ్ టచ్-బాడ్ టచ్ గురించి వివరించారు.

March 5, 2026 / 08:13 PM IST

‘మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి’

ASR: మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని పాడేరు డీఎస్పీ అభిషేక్ అన్నారు. గురువారం అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో ఎస్సై గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్లాస్ మాప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు విద్యార్ధినీలకు మహిళా హక్కులు, చట్టాలు గురించి వివరించారు. మహిళలకు సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలపాలని ప్రిన్సిపాల్ చలపతిరావు సూచించారు.

March 5, 2026 / 08:13 PM IST

కొడిమ్యాల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

JGL: కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జగిత్యాల జిల్లా అదరపు కలెక్టర్ బిఎస్ లత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు మానసికం ప్రశాంతతతో పరీక్షలు రాయాలని, వారికి పరీక్ష కేంద్రంలో తగిన ఏర్పాట్లు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

March 5, 2026 / 08:13 PM IST

BRSలో చేరిన చిన్న గోల్కొండ గ్రామ నాయకులు

RR: రాష్ట్ర అభివృద్ధిని సాధ్యమని రాజేంద్రనగర్ BRS ఇంఛార్జ్ కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు శంషాబాద్ డీవిజన్ నేత రాజమల జయసింహ ఆధ్వర్యంలో చిన్న గోల్కొండ గ్రామానికి చెందిన పలువురు నేతలు కార్తీక్ రెడ్డి సమక్షంలో BRSలో చేరారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని రాబోయేది BRS ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

March 5, 2026 / 08:12 PM IST

కర్నూలు జిల్లాకు అవార్డు రావాలి: కలెక్టర్

KRNL: స్వచ్ఛ సర్వేక్షణ్ మార్గదర్శకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై కర్నూలు కలెక్టర్ డా.ఏ.సిరి మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గతేడాది వచ్చిన ర్యాంక్ కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పారు. కచ్చితంగా జిల్లాకు అవార్డులు వచ్చేలా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

March 5, 2026 / 08:12 PM IST

విశాఖ జూపార్క్క కొత్త జంతువులు

విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్ ఇక నుంచి కొత్త జంతువులను చూడవచ్చు. అస్సాం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్ నుంచి జంతు మార్పిడి జరగడంతో గురువారం పలు జంతువును తీసుకువచ్చారు. అక్కడి నుంచి హిమాలయన్ బ్లాక్ టేర్, బ్లాక్ పాంథర్, కామన్ చిరుతపులి, ఆసియాటిక్ సింహం, ఏషియస్ పామ్ సివెట్ ఇక్కడకు చేరుకున్నాయి.

March 5, 2026 / 08:12 PM IST

‘సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలి’

SDPT: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మల్లికార్జున్ అధ్యక్షతన వార్డు ఆఫీసర్లతో సమీక్షా సమావేశం జరిగింది. 99 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు.

March 5, 2026 / 08:10 PM IST

మండల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

GDWL: పదో తరగతి విద్యార్థి భవిష్యత్తుకు పునాది, ప్రతి విద్యార్థి 570కి పైగా మార్కులు సాధించేలా పట్టుదలతో చదవాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. గురువారం గట్టు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. రాబోయే పది రోజులు అత్యంత కీలకమని, చదువుతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించి సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు.

March 5, 2026 / 08:10 PM IST

భగలాముఖి దేవిని దర్శించుకున్న అదనపు ఎస్పీ

MDK: శివంపేట శ్రీ భగలాముఖి దేవి శక్తి పీఠాన్ని దర్శించిన అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. జిల్లా ప్రజలు శాంతి, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇందులో ఎస్ఐ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.

March 5, 2026 / 08:10 PM IST

T20 WC: తృటిలో సంజూ శాంసన్ సెంచరీ మిస్

ఇంగ్లండ్‌తో సెమీస్‌లో సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. జాక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించగా.. బౌండరీ దగ్గర సాల్ట్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఈ ఇన్నింగ్స్‌లో సంజూ 8 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియాలో తను ఎంతటి విలువైన ఆటగాడో సంజూ మరోసారి నిరూపించుకున్నాడు.

March 5, 2026 / 08:08 PM IST

‘జీపీ కార్మికులను కాంగ్రెస్ మోసం చేసింది’

KNR: జీపీ కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందని, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు. ఆకునూరి సుధాకర్ అధ్యక్షతన హుజురాబాద్ హమాలీ యూనియన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జీపీ కార్మికులకు మూడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు.

March 5, 2026 / 08:08 PM IST

వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు

VZM: తెర్లాం పోలీసు స్టేషన్ కూడలిలో గురువారం సాయంత్రం ఎస్సై సాగర్ బాబు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. శిరస్త్రాణం విధిగా ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని కోరారు. ప్రయాణ సమయాల్లో వాహన పత్రాలు వెంట ఉండాలన్నారు. ట్రిబుల్ రైడింగ్ చేయకూడదన్నారు. ట్రాఫిక్ పోలీసు నిబంధనలు పాటించాలని కోరారు.

March 5, 2026 / 08:08 PM IST

నీటిలో పడి గొర్రెల మృతి..!

NDL: బేతంచర్ల మండలం బుగ్గనపల్లె గ్రామానికి చెందిన 80 గొర్రెలు బనగానపల్లె మండలం చెరువుపల్లె సమీపంలో మేతకు వెళ్లి నీటిలో ఒకదానిపై ఒకటి పడి ఇవాళ మృతి చెందాయి. విషయం తెలుసుకున్న డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సంఘటన స్థలానికి చేరుకుని రైతులను ఓదార్చారు. గొర్రెల మృతితో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని సంబంధిత అధికారులను ఆమె కోరారు.

March 5, 2026 / 08:07 PM IST

“నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు”

కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గురువారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని SHOలు, పోలీస్ సిబ్బంది అమలాపురం ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకున్నారు.

March 5, 2026 / 08:07 PM IST