GDWL: పదో తరగతి విద్యార్థి భవిష్యత్తుకు పునాది, ప్రతి విద్యార్థి 570కి పైగా మార్కులు సాధించేలా పట్టుదలతో చదవాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. గురువారం గట్టు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. రాబోయే పది రోజులు అత్యంత కీలకమని, చదువుతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించి సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు.