• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి తిరునాళ్లు

GNTR: కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి తిరునాళ్లు సోమవారం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం గ్రామంలో మేళతాళాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది. సోమవారం జరిగే తిరునాళ్ల మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని ఆలయ కమిటీ కోరింది.

March 2, 2026 / 09:51 AM IST

‘ఆపరేషన్ కవచ్’ సక్సెస్

KMR: జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ సత్ఫలితాలను ఇస్తోంది. రామారెడ్డి (M) పోసానిపేట వాసి పెంటయ్య ట్రాక్టర్‌ను నిందితులు దొంగిలించి బాన్సువాడలో విక్రయించేందుకు తరలిస్తుండగా ఆదివారం పద్మాజీవాడి X రోడ్డు వద్ద ‘ఆపరేషన్ కవచ్’ తనిఖీల్లో భాగంగా గాంధారి SI ఆంజనేయులు అడ్డుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

March 2, 2026 / 09:49 AM IST

హోలీ వేళ ప్రకృతి రంగుల కోలాహలం

VKB: హోలీ పండుగ సమీపిస్తున్న వేళ వికారాబాద్ జిల్లాలో ప్రకృతి రంగుల విందు చేస్తోంది. పెద్దేముల్ మండల పరిధిలోని జనగాం, మారేపల్లి, మంబాపూర్, తట్టేపల్లి, అడికిచెర్ల, ఇందూర్ సహా పలు గ్రామాల్లోని పొలాల గట్లు, అటవీ ప్రాంతం మోదుగ పూలతో ఎర్రగా మెరిసిపోతోంది. రోడ్డుకు ఇరువైపులా విరబూసిన ఈ పూలు అగ్ని కీలల్లా కనిపిస్తూ బాటసారులను కట్టిపడేస్తున్నాయి.

March 2, 2026 / 09:47 AM IST

సెమిస్టర్ ఫీజు చెల్లింపుకు అపరాధ రుసుంతో నేడే ఆఖరు

NZB: TU పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లింపునకు అపరాధ రుసుం రూ.100తో నేడే ఆఖరు తేదీ అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె.సంపత్ కుమార్ తెలిపారు. రూ.1,210 ఫీజుతో పాటు అపరాధ రుసుంతో చెల్లింపునకు అవకాశముందన్నారు. సాయంత్రం లోపు పరీక్షల ఫీజు చెల్లించాలన్నారు. పరీక్షలను మార్చి నెలలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

March 2, 2026 / 09:47 AM IST

నేటి నుంచి ఒంగోలులో పోలీస్ యాక్ట్ 30 అమలు

ప్రకాశం: ఒంగోలు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ శాఖ అనుమతి లేకుండా సమావేశాలు, సభలు, ర్యాలీలు నిర్వహించకూడదన్నారు.

March 2, 2026 / 09:47 AM IST

రేపు రామతీర్థంలోని ఆలయాలు మూసివేత

VZM: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని ఆలయాలను మంగళవారం మూసివేస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. పాల్గుణ శుద్ధ పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేస్తామని చెప్పారు. ఉదయం 9.30 నుంచి రోజంతా భక్తులకు దర్శనాలకు అవకాశం ఉండదన్నారు. చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత సంప్రోక్షణ చేస్తామని, బుధవారం యథావిధిగా ఆలయాలు తెరుస్తామని తెలిపారు.

March 2, 2026 / 09:46 AM IST

మల్లికార్జున స్వామి కళ్యాణం‌లో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: చందుర్తి మండల కేంద్రంలోనీ శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల మధ్య మల్లన్న కళ్యాణం నిర్వహించారు. మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

March 2, 2026 / 09:46 AM IST

రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ భేటీ

TG: సీఎం రేవంత్ రేపు సెక్రటేరియట్‌లో జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై ఆయన కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రగతి లక్ష్యంగా జరగనున్న ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, అభివృద్ధి పనుల వేగవంతంపై ఈ భేటీలో చర్చించనున్నారు.

March 2, 2026 / 09:46 AM IST

అంగరంగ వైభవంగా పద్మనాభుని తెప్పోత్సవం

VSP: పద్మనాభం మండలంలో కొండపై వెలసి ఉన్న అనంత పద్మనాభ స్వామి తెప్పోత్సవం ఆదివారం ఆలయ వేద పండితులు భక్తులు నడుము ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లను ఊరేగింపుగా కోనేరు వరకు తీసుకువెళ్లి పూలతో అలంకరించిన హంశ వాహనంపై కోనేరులోతెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో రాజు, ఎమ్మెల్యే గంట కుమారుడు రవితేజ, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 09:45 AM IST

టంగుటూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీఐ

ప్రకాశం: కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించడం, రికార్డుల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించడమే లక్ష్యంగా సీఐ హజరతయ్య టంగుటూరు పోలీస్ స్టేషన్‌ను ఆదివారం సందర్శించి సిబ్బందితో సమావేశమయ్యారు.పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. బాధితులకు న్యాయం అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

March 2, 2026 / 09:44 AM IST

‘సాధువులు చేస్తున్న ఆరోపణలు నిజం కాదు’

KKD: CM చంద్రబాబు తిరుమలను రాజకీయం చేస్తున్నారంటూ కొందరు సాధువులు చేసిన ఆరోపణలు సత్య దూరమని TTD ట్రస్టీ, MLA జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ఆదివారం కాకినాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఒక పార్టీ కొమ్ముకాస్తూ CMపై ఆరోపణలు చేయడం సరికాదని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు పన్నినా కూటమి ప్రభుత్వం హిందూ ధర్మానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

March 2, 2026 / 09:44 AM IST

64 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

అన్నమయ్య: పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో రూ. 64,11,890 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను బాధితులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న నియోజకవర్గ ప్రజలను ఆదుకోవడమే లక్ష్యమని, ప్రజల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిధులు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

March 2, 2026 / 09:43 AM IST

జామా మసీదులో ఇఫ్తార్ విందు

NRPT: జామా మసీదులో ఆదివారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందును మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు రెహమాన్ ఖాన్ ఏర్పాటు చేశారు. సామూహిక ప్రార్థనలు అనంతరం ఉపవాస విరమణ చేసి విందును స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పీఎస్ చిట్టెం మాధవరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మయ్య గౌడ్, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 09:42 AM IST

BREAKING: భారీగా తగ్గిన ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,290 తగ్గి రూ.1,69,800కు చేరింది. అలాగే, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,000 తగ్గి రూ.1,55,650గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గి రూ.3,15,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

March 2, 2026 / 09:42 AM IST

ఎంపీడీఓ చొరవ.. మారిన విద్యార్థుల భవిష్యత్తు

ASR: గుర్తేడు మండలం కె.వేజువాడలో చిన్నారుల భవిష్యత్తును ఆ ఎంపీడీఓ మార్చారనే చెప్పాలి. లోతట్టు గిరిజన గ్రామం అయిన కె.వేజువాడలో 6నెలల క్రితం చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఎంపీడీఓ బాపన్న దొర P4 కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధ్యాయుడిని నియమించి చిన్నారులు పాఠశాలకు వచ్చేట్టు చేశారు.

March 2, 2026 / 09:42 AM IST