TG: సీఎం రేవంత్ రేపు సెక్రటేరియట్లో జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై ఆయన కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రగతి లక్ష్యంగా జరగనున్న ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, అభివృద్ధి పనుల వేగవంతంపై ఈ భేటీలో చర్చించనున్నారు.