CTR: గుడిపాల (M)నికి చెందిన ఓ మైనర్ బాలిక చిత్తూరులో అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. బాలిక 23వ తేదీ కాలేజీకి వెళ్లొస్తానంటూ ఇంటి నుంచి బయలుదేరి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలమనేరు మండలానికి చెందిన మరో బాలిక సైతం ఆదివారం చిత్తూరులో మిస్సయిన ఘటనపై కేసు నమోదు అయింది.