AKP: నక్కపల్లి మండలం వైసీపీ అధ్యక్షుడిగా సీతంపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ గొర్ల గోవిందరావు నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండలానికి నూతన కార్యవర్గాన్ని పార్టీ కేంద్ర కమిటీ గురువారం ప్రకటించింది. అలాగే, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా మండలానికి చెందిన జి. నరసింహమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శిగా జి బాబురావును నియమించారు.
తనను జైలుకు పంపిన మాజీ ప్రేయసి సరస్వతి(మృణాల్ ఠాకూర్)పై హరిదాస్(అడివి శేష్) ఎలా పగ తీర్చుకున్నాడనేదే ‘డెకాయిట్’ కథ. శేష్, మృణాల్ కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్స్, పాటలు సినిమాకు ప్లస్. ఫస్టాఫ్ ఉత్కంఠగా ఉన్నా, సెకండాఫ్‌లో వేగం తగ్గడం, లాజిక్ లేని సీన్లు మైనస్. క్లైమాక్స్ ఎమోషనల్‌గా బాగుంది. మేకింగ్ పరంగా మెప్పించిన ఈ ఎమోషనల్ డ్రామా రేటింగ్:3/5.
ADB: కాకతీయ యూనివర్శిటీ డిగ్రీ బ్యాక్‌లాగ్ పరీక్షల టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 12 నుంచి 22 వరకు, మూడో సెమిస్టర్ పరీక్షలు మే 12 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. అలాగే ఐదో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభమై మే 13 వరకు కొనసాగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం వెల్లడించింది.
కోనసీమ: పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడక్టు వంతెనపై శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు పునఃప్రారంభం కానున్నట్లు ఇరిగేషన్ డీఈ రవీంద్రబాబు తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి మూసివేసిన ఈ వంతెనకు సుమారు రూ.61 లక్షల వ్యయంతో మరమ్మతులు పూర్తి చేశారు. వంతెనపై సోలార్ దీపాలు, ట్రాఫిక్ సూచికలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
TG: నీటిపారుదల అధికారుకు మాజీ సీఎం KCR ఫోన్ చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే కాలువకు నీటిని వదల్లేదు. దీంతో ఆయా గ్రామాల పరిధిలో పంటలు ఎండిపోతున్నాయని ఉమ్మడి మెదక్ జిల్లా DCCB మాజీ డైరెక్టర్ అంజిరెడ్డి దృష్టికి రైతులు తీసుకువెళ్లగా… ఆయన KCRకు విన్నవించారు. దీంతో KCR నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయించారు.
MBNR: జిల్లా కేంద్రంలోని ఫ్రీడమ్ మైదానంలో ఈ నెల 11న అండర్-23 ‘టుడే లీగ్’ క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 8 గంటలకు సొంత కిట్టు, ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు మైదానంలో సంప్రదించాలన్నారు.
VKB: గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన VKB జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దేముల్ మండల పరిధిలోని ఇందూరులో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దూస శ్రీనివాస్ గుండెపోటుకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. శ్రీనివాస్ మృతి పట్ల వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులతోపాటుగా పలువురు ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు.
ప్రకాశం: టంగుటూరులో వాహనాలు అడ్డదిడ్డంగా పెడుతుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. టంగుటూరు బస్టాండ్ కూడలి దగ్గర నుంచి పొదిలి వైపు వచ్చే రహదారుల షాపింగ్ కాంప్లెక్స్ ముందు వాహనాలు నిలుపుతుండడంతో తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పిందించి ట్రాఫిక్‌ను నియంత్రించాలని కోరుతున్నారు.
NLR: వెంకటాచలంలో టీడీపీ మండల కార్యాలయాన్ని గురువారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా మండల టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడారు. త్వరలోనే వెంకటాచలంలో శాశ్వత భవనం నిర్మిస్తామన్నారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ వార్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం మేకర్స్ ఒకేసారి రెండు యూనిట్లను రంగంలోకి దించారు. హను ప్రధాన తారాగణంపై కీలక సీన్లు తీస్తుండగా, సెకండ్ యూనిట్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తోంది. దీనివల్ల పని వేగంగా జరగడమే కాక, క్వాలిటీ కూడా అద్భుతంగా వస్తుందని చిత్రబృందం భావిస్తోంది.
E.G: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ పీ.మనోహర్ గురువారం హెచ్చరించారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్‌పై డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బైక్ నడిపిన రామారావు, లారీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రూ.11,500 చొప్పున జరిమాన విధించారు.
WNP: అమరచింత పెద్ద చెరువు ఆధునీకరణకు మంత్రి వాకిటి శ్రీహరి ఇప్పటికే శంకుస్థాపన చేశారని, ఇప్పుడు మళ్లీ బీజేపీ నాయకులు ప్రారంభం చేయడం మంత్రిని అవమానించడమేనని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అరుణ్ కుమార్ గురువారం విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో రూ.314 లక్షల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయని, దీనిపై రాజకీయాలు చేయొద్దని అన్నారు.
MBNR: రాజాపూర్ మండల పరిధిలోని తిర్మలాపూర్‌లో ‘ఆది చింతల మునిరంగ స్వామి’ వీధి నాటకం భక్తులను విశేషంగా అలరించింది. స్వామి కృప గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ.. ఉండాలని భక్తులు కోరుకున్నారు. ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు. సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామీణ కళలు, భక్తి సంప్రదాయాల పరిరక్షణలో వీధి నాటకాలు కీలకమని తెలిపారు.
RR: బీజేపీ, RSSలను ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అనంతరెడ్డి ఖండించారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలను నివారించాలని తెలిపారు.
HYDలో ఈ నెల 12న జరగనున్న CDS, ఎన్డీయే పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని 27 కేంద్రాల్లో 10,967 మంది అభ్యర్థులు హాజరుకానుండగా ఈసారి ‘ఫేస్ అథెంటికేషన్’ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలని DRO వెంకటాచారి అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు ఈ-అడ్మిట్ కార్డ్, ID ప్రూఫ్‌తోనే రావాలని, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.