MHBD: నెల్లికుదురు మండలంలోని నైనాల గ్రామంలో చట్ట సాయిలుతో పాటు ఆయన మనవడు యాకయ్యపై ఇంటి స్థలం గొడవలో అదే గ్రామానికి చెందిన ఎండీ, పాలుద్దీన్, ఇమామ్, అన్వర్లు కర్రతో దాడికి పాల్పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు బాధితుల ఇంటి వద్దనే కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.
NLG: నార్కట్ పల్లిలోని జిందాల్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వెల్డర్ గణేష్ విశ్వకర్మ (34) మృతి చెందినట్లు నార్కట్ పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. వేయింగ్ బ్రిడ్జి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇనుప పైపు మీద పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు.
NGKL: నల్లమల అటవీ ప్రాంతంలో ఏడాదిలో కేవలం మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే దర్శనమిచ్చే సలేశ్వరం రామలింగేశ్వర స్వామి జాతరకు సంబంధించి ఏర్పాట్లు అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టింది. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నల్లమల దట్టమైన అటవీ ప్రాంతంలోని లోయలో రామలింగేశ్వర స్వామి దర్శనం ఇవ్వనున్నారు.
NDL: కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట గ్రామంలో ఇవాళ మెట్ల సువర్ణ అనే మహిళపై శేఖర్ అతని భార్య కుమారుడు ముగ్గురు కలిసి దాడి చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. దాడిలో మెట్ల సువర్ణకు గాయాలు కావడంతో చికిత్స కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శేఖర్ అతని భార్య కుమారునిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.
AP: మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు అన్నివిధాల అండగా ఉంటాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. అలాగే, ఈ ఘటనపై మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
KMM: వైరా నియోజకవర్గంలోని గిరిజన తండాలు, ఎస్సీ కాలనీల్లోని నిరుపేదలకు పక్కా గూడు కల్పించడమే లక్ష్యమని బుధవారం MLA రాందాస్ నాయక్ పేర్కొన్నారు. లబ్ధిదారుల సంఖ్యను 5 వేలకు పెంచాలని శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
WG: గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణకు SEC నీలం సాహ్ని ఏప్రిల్ 15 వరకు గడువు పొడిగించారు. టెక్నికల్ సమస్యలు ఉన్నందున 4 వారాలు గడువు ఇవ్వాలని అధికారులు కోరగా తొలుత అంగీకరించలేదు. దీంతో ప్రభుత్వం కలెక్టర్ల నుంచి మరింత సమాచారాన్ని సేకరించి సమర్పించడంతో ఒప్పుకున్నారు. మరోవైపు సర్పంచ్ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది.
SKLM: కోటబొమ్మాళిలో ఇవాళ జరగనున్న సన్నాహక సమావేశానికి నేతలు, కార్యకర్తలు హాజరుకావాలని వైసీపీ మండలాధ్యక్షుడు సంపతిరావు రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ హాజరుకానున్నారు. మన మూలపేట పోర్టుకు పోదాం కార్యక్రమం నేపథ్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
KDP: ఒంటిమట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతం, తదనంతరం మూలవిరాట్లకు అలంకరణ, ఆరాధన, అర్చన, కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 27న ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 4 గంటలకు పోతన జయంతి, కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తారు.
NRPT: మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో ‘Arrive Alive’ థర్డ్ ఫేజ్ కార్యక్రమం భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ సీఐ శ్రీ రామ్ లాల్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
ASR: విద్యార్థి దశ నుండే హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు సూచించారు. బుధవారం సాయంత్రం ఆయన ఎస్సై కిషోర్ వర్మతో కలిసి రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో సమావేశం నిర్వహించి, పలు అంశాలపై అవగాహన కల్పించారు. చిన్నప్పటి నుంచి ఉన్నత లక్ష్యంతో చదివితే మంచి భవిష్యత్తు పొందవచ్చన్నారు.
TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)కి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను విశ్లేషించే క్యూఎస్(క్వాక్వారెల్లి సైమండ్స్) సంస్థ విడుదల చేసిన ‘వరల్డ్ యూనివర్సిటీ బై సబ్జెక్ట్’ 2026 సంచికలో HCUలో నిర్వహిస్తున్న 7 సబ్జెక్టులకు ర్యాంకులు లభించాయి. 2026 గణాంకాల ప్రకారం దేశంలోని 99 సంస్థల్లోని 529 సబ్జెక్టులకు క్యూఎస్ ర్యాంకులు లభించాయి.
సిద్దిపేట జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని సీపీ రోహిణి ప్రియదర్శిని స్పష్టం చేశారు. అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు. వదంతులు నమ్మి వాహనదారులు ఆందోళన చెందవద్దని, ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
MBNR: డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టవిరుద్ధమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో మాట్లాడుతూ.. గత 15 రోజులుగా జిల్లాలోని హోటళ్లు,రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లను తనిఖీలు చేయగా, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న మొత్తం 173 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 121 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.
బాపట్ల జిల్లాలో గృహ వినియోగానికి 3,389 గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల అధికారి జమీర్ బాషా తెలిపారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారు 35 రోజుల తర్వాతే బుకింగ్ చేయాలని సూచించారు. గ్యాస్ సంబంధిత సమాచారం కోసం 94932 47765 నంబర్‌ను సంప్రదించాలని చెప్పారు.