• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యెజ్డీ రోడ్‌స్టర్ ‘రెడ్ వోల్ఫ్’ ఎడిషన్ లాంచ్

క్లాసిక్ లెజెండ్స్ తన యెజ్డీ రోడ్‌స్టర్ మోడల్‌లో ‘రెడ్ వోల్ఫ్’ పేరుతో స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధర ₹2.10 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. ఈ కొత్త ఎడిషన్ ముదురు ఎరుపు రంగు (Deep Red) పెయింట్ ఫినిషింగ్, ఇంజిన్, ఎగ్జాస్ట్ పై క్రోమ్ డిటైలింగ్‌తో ఆకట్టుకుంటోంది. ఇది 334cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది.

March 6, 2026 / 08:07 AM IST

జాతీయ రేసింగ్ పోటీల్లో బాసర IIIT విద్యార్థుల ప్రభంజనం

NRML: ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి ‘ఇస్సీ సీజన్-13’ రేసింగ్ పోటీల్లో బాసర త్రిపుల్ ఐటీకి చెందిన ‘టీమ్ గరుడ’ ఆల్ ఇండియా స్థాయిలో 5వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. యాక్సిలరేషన్ విభాగంలో మొదటి స్థానాన్ని, డిజైన్ క్విజ్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వర్సిటీ అధికారులు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు.

March 6, 2026 / 08:04 AM IST

స్కూటీ నడుపుతూ ఏర్పాట్లు పరిశీలించిన ఆలయ ఈవో

SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివకళ్యాణం ఏర్పాట్లను, గురువారం రాత్రి ఆలయ జీవో రమాదేవి స్వయంగా స్కూటీ నడుపుతూ పరిశీలించారు. శివార్చన స్టేజ్ వద్ద కళ్యాణ వేదికను సిద్ధం చేశారు. కళ్యాణాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, భోజన వసతి, త్రాగునీరు, నీడ కోసం టెంట్లు, చలువ పందిళ్లు, పరిశీలించారు.

March 6, 2026 / 08:01 AM IST

నేడు రంగనాథస్వామి తెప్ప ట్రయల్ రన్

నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా, తెప్ప పనితీరును పరిశీలించడం కోసం ఉదయం 10:30 గంటలకు పెన్నానది తీరంలోని తెప్పోత్సవ ఘాట్ వద్ద తెప్ప ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

March 6, 2026 / 08:00 AM IST

హిందూపురంలో మెగా జాబ్ మేళా.. ఎప్పుడంటే?

సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 15న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. హిందూపురంలోని సప్తగిరి డిగ్రీ, పీజీ కళాశాలలో జరిగే ఈ మేళాలో 90కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 5,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. యువతీ యువకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

March 6, 2026 / 08:00 AM IST

‘జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి’

KKD: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి సభ్యత్వ నమోదు ఎంతో కీలకమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గ నాయకులు, ‘సాధక్’లతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలపై జనసేన చేస్తున్న పోరాటాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

March 6, 2026 / 08:00 AM IST

విదుర నీతి: ఈ నాలుగింటిని వదిలిపెట్టకండి

జీవితంలో అప్పు, అగ్ని, శత్రువు, వ్యాధి.. ఈ నాలుగింటిని సగం వదిలేయకూడదని, పూర్తిగా నిర్మూలించాలని విదురుడు హెచ్చరించాడు. వీటిలో ఏ కొద్ది భాగం మిగిలినా మళ్లీ విజృంభిస్తాయి. అప్పు వడ్డీతో పెరుగుతుంది, నిప్పు రాజుకుంటుంది, శత్రువు పగ తీర్చుకుంటాడు, వ్యాధి ప్రాణాలు తీస్తుంది. కాబట్టి ఈ నాలుగింటిని ఎప్పుడూ సమూలంగా నాశనం చేయాలని విదుర నీతి సారాంశం.

March 6, 2026 / 08:00 AM IST

కూరగాయల మార్కెట్ నిర్మాణానికి స్థల పరిశీలన

KNR: హుజరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒడితెల ప్రణవ్ బాబు చొరవతో కమలాపూర్‌లో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద స్థలాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, ఇంజనీర్ ఎల్లేష్ పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు ఆధునాతన మార్కెట్ యార్డు నిర్మించనున్నట్లు మార్కెట్ ఛైర్మన్ తౌటం జాన్సీ రాణి తెలిపారు.

March 6, 2026 / 07:58 AM IST

తొలిరోజు 30 వేల హాల్ టికెట్లు డౌన్‌లోడ్

TG: పదో తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్ టికెట్లు విడుదలైన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ హాల్ టికెట్లను 80969 58096 వాట్సాప్ నంబర్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. మొదటి రోజు 30 వేల మంది విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

March 6, 2026 / 07:58 AM IST

తిప్పతీగ కషాయం.. ఆరోగ్యానికి అమృతం

ఆయుర్వేదంలో ‘అమృతవల్లి’గా పిలిచే తిప్పతీగ కషాయం తాగడం వల్ల రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక జ్వరాలను తగ్గించడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ మితంగా తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించడంతో పాటు రక్తం కూడా శుద్ధి అవుతుంది.

March 6, 2026 / 07:56 AM IST

40 ఏళ్ల తర్వాత విశాఖ ‘జూకు’ బ్లాక్ పాంథర్

విశాఖ జుపార్కుకి అరుదైన బ్లాక్ పాంథర్ వచ్చి చేరింది. అస్సాం స్టేట్ జూ పార్కుతో జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా పలు జంతువులను ఇక్కడకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత ఆడ బ్లాక్ పాంథర్‌ను తీసుకురావడం విశేషం. అస్సాం నుంచి వచ్చిన అడవి మగ చిరుత, జంతువుల జన్యుపరమైన వైవిధ్యాన్ని పెంచుతుందని అధికారులు తెలిపారు.

March 6, 2026 / 07:55 AM IST

ఆవుపై చిరుత దాడి.. సీసీ కెమెరా ఫొటో

ADB: బోథ్ మండలంలోని కరత్వాడలో చిరుతపులి కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు గంగయ్యకు చెందిన ఆవుపై చిరుత దాడి చేసి హతమార్చింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించగా, గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ దాడి జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

March 6, 2026 / 07:52 AM IST

‘స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి’

AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వైసీపీ శ్రేణులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. మునగపాక క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ పాల్గొన్నారు.

March 6, 2026 / 07:52 AM IST

ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్

JN: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM Surya Ghar Muft Bijli Yojana ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రాయితీ పథకాలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

March 6, 2026 / 07:51 AM IST

అక్రమ గంజాయి రవాణా.. 20 ఏళ్ల జైలు శిక్ష

KMM: వెంకటపాలెం గంజాయి స్మగ్లింగ్ కేసులో నిందితులకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2021 ఏప్రిల్ 7న వెంకటపాలెం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న 194 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి, నేరం నిరూపితం కావడంతో శిక్ష విధించింది.

March 6, 2026 / 07:49 AM IST