NDL: శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో 10 రోజులవుతున్నా నీటి సరఫరా చేయకపోవడంపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పనులను సాకుగా చూపి అధికారుల నిర్లక్ష్యంతో నీటి సరఫరా చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు తాగేందుకు చుక్క నీరు లేదు కానీ రోడ్లకు క్యూరింగ్ చేసేందుకు ఫిల్టర్ హౌస్ నీటిని వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ATP: రజక జాతి చిన్నారి మౌనిక మృతికి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం గుత్తి శ్రీ వెంకటేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రజక సంఘం నాయకులు కిరణ్, సురేష్ మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మౌనికపై దాడి చేసి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
SKLM: ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు సర్పంచ్ పంచి రెడ్డి రాంబాబు చెక్ పవర్‌ను పలు ఆరోపణలతో 10 నెలల క్రితం అధికారులు రద్దు చేశారు. అయితే తన తప్పు లేదని జిల్లా కేంద్రంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో పదిసార్లు ఫిర్యాదు చేశారు. చివరకు హైకోర్టుని ఆశ్రయించగా చెక్ పవర్ పునరుద్ధరించాలని తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు అమలుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
TG: నిజామాబాద్(D) ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో దారుణం జరిగింది. మద్యం, గంజాయికి బానిసైన కుమారుడు భానుప్రకాష్‌ను తండ్రి కిషన్ గొడ్డలితో నరికి చంపాడు. కొడుకు వ్యసనాలతో విసిగిపోయిన తండ్రి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం కిషన్ నేరుగా ఇందల్వాయి PSకు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
WGL: చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం శివారులో గురువారం ఉదయం పంటపొలాల్లో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదం లేదా హత్యన అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు, మృతుడు ఎవరో గుర్తించాల్సి ఉంది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారులోని భీముని పాదం జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది. పచ్చని అడవుల మధ్య కనువిందు చేస్తున్న ఈ ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. నర్సంపేట-గూడూరు ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు సరైన వేదికగా మారింది.
PLD: నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో గురువారం 65-70 ఏళ్ల వయసు గల గుర్తుతెలియని వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. బుకింగ్ కౌంటర్ వద్ద కూర్చుని ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించామని, మృతుని వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
NTR: నందిగామ ఎంపీడీవో ఆర్.వి.యస్. ప్రసాదరావు గురువారం అంబారుపేట గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి జరుగుతున్న హౌస్ టాక్స్ వసూళ్లను స్వయంగా పరిశీలించారు. నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం పెరిగింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లలో ఇటీవల చిరుతపులి, ఎలుగుబంటికి సంబంధించిన దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇది జిల్లా అటవీ పర్యావరణ వ్యవస్థలో జీవవైవిధ్యం ఆరోగ్యంగా ఉందనడానికి నిదర్శనమని అధికారులు తెలిపారు.
HYD: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వేం నరేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా బీ-ఫామ్‌ను అందుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు సమీపంలో గురువారం ఉదయం ఆటో బోల్తా పడి ఓ యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న 108 ఈఎంటి లింగంపల్లి శ్రీనివాస్ పైలట్ సైదులు ప్రథమ చికిత్సను అందించి రక్తస్రావమును అరికట్టి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
VZM: ఎల్.కోట మండలం ఆర్.జి.పేట పరిసర ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అసెంబ్లీలో కోరారు. ఆర్.జి.పేట సమీపంలో ఉన్న పరిశ్రమల కారణంగా చుట్టుపక్కల ఉన్న సుమారు 15 గ్రామాలకు లో-వోల్టేజ్ సమస్య తలెత్తుతోందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె సభ దృష్టికి తీసుకువచ్చారు.
VSP: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన ముగ్గురు నేతల ఫొటోను మంత్రి లోకేశ్ పంచుకున్నారు. లోకేశ్, పల్లా, గంటా శ్రీనివాసరావు కలిసి ఉన్న ఈ ఫొటోలో గెలుపు తమపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తోందన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిబద్ధతతో సేవ చేస్తామని తెలిపారు.
WGL: రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్‌లో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మత్స్యకారులు దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సారెస్పీ కెనల్‌లో ఆగిపోయిన నీటి ప్రవాహం కారణంగా దేహం బయటకు వచ్చింది. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు.