• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నారా లోకేష్ ఆత్మీయ విందులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

నెల్లూరు: అమరావతి, ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులతో మంగళవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ అందించిన ఆత్మీయ స్వాగతం, చూపించిన ప్రేమాభిమానాలు తమను ఎంతో హత్తుకున్నాయన్నారు.

March 4, 2026 / 07:12 AM IST

నిరుద్యోగులకు APMSRB హెచ్చరిక

AP: ఎవరైనా మధ్యవర్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీలు ఇస్తే నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ వైద్యసేవల నియామక బోర్డు(APMSRB) హెచ్చరించింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసపూరిత కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. బోర్డు నిర్వహించే అన్ని నియామకాలు రిజర్వేషన్ నిబంధనలు, మెరిట్ ఆధారంగా జరుగుతాయని వెల్లడించింది.

March 4, 2026 / 07:07 AM IST

ఈనెల 6న జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్

MNCL: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జై కిషన్ ఓజా ప్రకటనలో తెలిపారు. ‘ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు- భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 9963104959 నెం.లో సంప్రదించాలన్నారు.

March 4, 2026 / 07:05 AM IST

నేడు మంచినీటి సరఫరా బంద్

TPT: గూడూరు 2వ పట్టణ పరిధిలో రాపూరు రోడ్డులో మాసు వద్ద ఉన్న నీటి సరఫరా పైప్‌లైన్ దెబ్బతినడంతో బుధవారం ఒకటవ పట్టణ పరిధిలో మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. యథాతథంగా గురువారం పట్టణంలో మంచినీటి సరఫరా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

March 4, 2026 / 07:03 AM IST

మండల ఉప సర్పంచుల సంఘ అధ్యక్షుడిగా ప్రవీణ్

MBNR: బాలానగర్ మండలంలో 37 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మోతీ ఘనపూర్ మొదటి వార్డు సభ్యుడుగా గెలుపొందారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల ఉప సర్పంచులు సమావేశమై ప్రవీణ్ కుమార్‌ను మండల ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రవీణ్ కుమార్‌ను అభినందించి శాలువాతో సన్మానించారు.

March 4, 2026 / 07:02 AM IST

వన్యప్రాణుల సంరక్షణ సమాజంలో అందరి బాధ్యత

SRPT: వన్యప్రాణుల సంరక్షణ సమాజంలో అందరి బాధ్యత అని కోదాడ ప్రముఖ వైద్యులు సుబ్బారావు అన్నారు. మంగళవారం రాత్రి కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ప్రపంచ వైద్య ప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా. కోదాడ రచయిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.. భూమి మీద జీవించే హక్కు అన్ని జీవరాశులకు ఉంటుందన్నారు.

March 4, 2026 / 07:02 AM IST

స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. 20 మంది అరెస్ట్!

హైదరాబాద్‌లోని KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు స్పా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా, చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించి రెండు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో మొత్తం 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేదిలేదన్నారు.

March 4, 2026 / 07:02 AM IST

‘అంగన్వాడీల అరెస్ట్ మోసం’

ప్రకాశం: అంగన్వాడీ, ఆయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని CITU నాయకుడు షేక్ అన్వర్ అన్నారు. విజయవాడలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు అంగన్వాడీల ధర్నా శిబిరంపై ప్రభుత్వం పాశవికంగా దాడిచేసి అరెస్టులు చేసిందని తెలిపారు. అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా ప్రజాస్వామ్య హక్కులను హరించారని అర్థవీడులో నిరసన వ్యక్తం చేశారు.

March 4, 2026 / 07:00 AM IST

నేటి నుంచి కాశీవిశ్వ నాథేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

NLG: శాలిగౌరారం మండలంలోని గురుజాలలో గల శ్రీవిశాలాక్ష సమేత కాశీవిశ్వ నాథేశ్వరస్వామి ఆలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి రెండు రోజులపాటు ఘనంగా జరుగనున్నాయి. ఇవ్వాళ గణపతిపూజ, పంచామృత అభిషేకం, పుణ్యా హవాచనం, నవగ్రహ పూజ, అంకురార్పణ, కంకణధారణ, కూశ్మాండభవధనం, గ్రామ దర్శనం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.

March 4, 2026 / 07:00 AM IST

నేడు జైలు నుంచి బాల్క సుమన్ విడుదల

TG: BRS నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు రెండో కేసులోనూ బెయిల్ లభించింది. చెన్నూరు కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేయడంతో, ఇవాళ ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ సందర్భంగా వందలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన క్యాతనపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి.

March 4, 2026 / 07:00 AM IST

వన్యప్రాణిని చంపిన వ్యక్తులపై కేసు నమోదు

MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి రేంజ్లో ముందస్తు సమాచారం మేరకు అటవీ అధికారులు సోదాలు నిర్వహించి వన్యప్రాణిని చంపి వండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేతనపల్లి శివారులో విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణిని వేటాడినట్లు నిందితులు అంగీకరించారు. నెందుగూరి నారాయణ, గురుండ్ల వసంత్, నిక్కూరి బాపుపై కేసు నమోదు చేసినట్లు FRO హఫీజుద్దీన్ తెలిపారు.

March 4, 2026 / 06:56 AM IST

రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

దేశవ్యాప్తంగా రేపటి నుంచి ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఐఏటీ)కి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. తుది గడువు ఏప్రిల్ 13తో ముగుస్తుంది. ప్రవేశ పరీక్ష జూన్ 7న నిర్వహిస్తారు. ఏపీలోని తిరుపతితో పాటు తిరువనంతపురం, కోల్‌కతా, భోపాల్, పూణె, మొహాలి, బెర్హంపూర్‌లో ఐసర్లు ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్(BS), బీటెక్‌తో పాటు BS-MS ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉన్నాయి.

March 4, 2026 / 06:56 AM IST

ఏపీ ఉపాధ్యాయ జేఎసీ వైస్ ఛైర్మన్‌గా రాజాం

VZM: ఉపాధ్యాయ APJAC జిల్లా వైస్‌ ఛైర్మన్‌గా రాజాం మండలం కంచరాం మండల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మజ్జి మదనమోహన్‌ ఎన్నికయ్యారు. మంగళవారం స్దానిక NGO హోమ్‌లో నిర్వహించిన APJAC జిల్లా కార్యవర్గ ఎన్నికలలో ఆయనను ఎన్నుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళంలో మూడుసార్లు APTF అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడుగా కూడా ఎన్నికయ్యారు.

March 4, 2026 / 06:52 AM IST

మార్చి ప్రారంభంలోనే 35°C ఉష్ణోగ్రతలు

ASF: జిల్లాలో మార్చి తొలి వారంలోనే సగటు ఉష్ణోగ్రత 35°C చేరింది. ఏప్రిల్, మే, జూన్లో పరిస్థితి మరింత కష్టతరం కావచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని, గొడుగును ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.

March 4, 2026 / 06:48 AM IST

ఉరివేసుకొని వ్యక్తి మృతి

GNTR: తుళ్లూరు టిట్కో గృహాల్లో ఒడిశాకు చెందిన మనోజ్ (32) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అమరావతి నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తున్న అతడు, మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

March 4, 2026 / 06:47 AM IST