MBNR: బాలానగర్ మండలంలో 37 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మోతీ ఘనపూర్ మొదటి వార్డు సభ్యుడుగా గెలుపొందారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల ఉప సర్పంచులు సమావేశమై ప్రవీణ్ కుమార్ను మండల ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రవీణ్ కుమార్ను అభినందించి శాలువాతో సన్మానించారు.