MNCL: బెల్లంపల్లిలో గాలి దుమారంతో కూడిన కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పట్టణంలోని 13వ వార్డులో విద్యుత్తు స్తంభం తగలడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఈ క్రమంలోనే 8 మేకలు మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ రాజకుమార్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ అధికారులు, వెటర్నరీ సిబ్బందిని పిలిపించి పంచనామా చేయించారు.