NDL: అవుకు మండలం కోనాపురం గ్రామానికి చెందిన అనారోగ్య కార్యకర్తలు జగదీష్, సుధాకర్లను ఆదివారం YCP రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబుల్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.