ప్రకాశం: టంగుటూరు మండలం మర్లపాడు గ్రామ సమీపంలోని ప్రభుత్వ తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన నీటి మోటార్ల విద్యుత్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. ఉదయాన్నే నీటిని వదలాలని వచ్చిన సిబ్బంది వైర్లు కత్తిరించి ఉండడాన్ని గమనించారు. రాగి వేరు దొంగిలించినట్లు ఉన్నత అధికారులకు సిబ్బంది సమాచారం అందించారు.