KMR: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఈ నెల రోజుల పాటు ‘30, 30(ఏ) పోలీసు యాక్ట్ 1861’ అమలులో ఉంటుందని ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని తెలిపారు.