MDK: మెదక్ మండలం మాచవరం గ్రామానికి చెందిన శిల్ప, ఆమె ఇద్దరు కుమారులు మనోజ్, శశాంక్ అదృశ్యమయ్యారు. ఇంటర్ సీట్ల కోసం మే 27న హైదరాబాద్ వెళ్లిన వీరు తిరిగి ఇంటికి రాలేదని శిల్ప భర్త అశోక్ తెలిపారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆయన మెదక్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు.