BPT: వాడరేవు–పిడుగురాళ్ల రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. చీరాల వైపు వస్తున్న కారు, పర్చూరు వెళ్తున్న బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు బైక్ నడుపుతున్న వ్యక్తి తలకు బలమైన గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.