HNK: ACP నరసింహారావు ఆదేశాల మేరకు హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి CI రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేసినట్లు CI వెల్లడించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని నిబంధనలు ఉల్లంఘిస్తే కట్టిన చర్యలు తీసుకుంటామన్నారు.