KRNL: మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు మృతిచెందిన విషాదకర ఘటనపై ఆదివారం మాజీ సీఎం, YCP అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.