WGL: వైద్యులు కేవలం చికిత్సకే పరిమితం కాకుండా సమాజ మార్పుకు మార్గదర్శకులుగా నిలవాలని సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం వరంగల్ ఐఎంఏ హాల్లో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజ శ్రేయస్సు కోసం వైద్యులు సేవాభావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.