హైదరాబాద్లోని KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు స్పా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా, చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించి రెండు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో మొత్తం 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేదిలేదన్నారు.