• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జగన్‌కు శ్రీవారంటే నమ్మకం లేదు: పయ్యావుల

AP: లడ్డూ నెయ్యిలో జంతుకొవ్వు ఉందని NDDB నివేదికలో ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ‘జగన్‌కు శ్రీవారంటే నమ్మకం లేదు.. సభలో రాజకీయం చేయొద్దు. లడ్డూ నెెయ్యి కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డే అంగీకరించారు. 2019-24 మధ్య లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చించాలి. సభను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోంది. సంబంధం లేని కంపెనీ పేర్లు ప్రస్తావించడం సరికాదు’ అని పేర్కొన్నారు.

March 4, 2026 / 04:27 PM IST

‘వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

VZM: వేసవి దృష్ట్యా వడదెబ్బ వచ్చే అవకాశమున్నందున ప్రజలందరూ తప్పనిసరిగా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని DMHO డాక్టర్ ఎస్. జీవన రాణి ఒక ప్రకటనలో తెలిపారు. బయటకు వెళ్ళినప్పుడు గొడుగు, తెలుపురంగు లేదా పలుచటి చేనేత వస్త్రాలు ధరించాలాన్నారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడిచి గాలి తగిలేలా చూడాలన్నారు.

March 4, 2026 / 04:26 PM IST

నార్సింగి ఇంఛార్జ్ ఎంపీడీవోగా చెన్నారెడ్డి బాధ్యతలు..!

MDK: నార్సింగి మండల ఇంఛార్జ్ ఎంపీడీవోగా చెన్నారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యంపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

March 4, 2026 / 04:25 PM IST

న్యూజెన్.. ఆరోగ్యం డేంజర్!

ఈతరం యవతీ యువకులతో పోలిస్తే.. 1990లలో పుట్టిన వారు ఆరోగ్యంగా, ఆనందంగా, యవ్వనంగా కనిపిస్తుంటారు. కారణం వారి బాల్య జీవితమంతా ఎక్కువ భాగం ప్రకృతితో సంబంధం కలిగి ఉండటమే! ఈతరం వారితో ప్రకృతితో సంబంధాలు 60%కి పైగా తగ్గిపోయాయట. దీనినే ‘extinction of experience’ అనే సమస్యగా అభివర్ణిస్తున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ, పని, ఉపాధి, ఉద్యోగాల వంటివి కారణం అవుతున్నాయి.

March 4, 2026 / 04:25 PM IST

‘బాధితుడిని కలెక్టర్ ఆదుకోవాలి’

CTR: SRపురం(M) మిట్టహరిజనవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో నవీన్‌కు చెందిన ఐదెకరాల చెరుకు పంట దగ్ధం అయింది. బాధితులను వైసీపీ నేత నారాయణస్వామి, నియోజకవర్గ ఇంఛార్జ్ కృపాలక్ష్మి పరామర్శించారు. బాధితులను కలెక్టర్ ఆదుకోవాలని వారు కోరారు. ప్రమాదంలో దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, బాధితులు మరో ఐదేళ్లు కోలుకునే అవకాశం లేదన్నారు.

March 4, 2026 / 04:24 PM IST

తిరుమలాపురం అంగన్వాడీ కేంద్రం తనిఖీ

KMM: చింతకాని మండలం తిరుమలాపురం అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం సర్పంచ్ చాపలమడుగు వీరబాబు సందర్శించారు. కేంద్ర నిర్వహణ, చిన్నారుల హాజరు, పోషకాహార పంపిణీ తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలకు బాలామృతం, కోడిగుడ్లు పంపిణీ చేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 4, 2026 / 04:22 PM IST

త్వరలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన?

TG: మాజీ సీఎం KCR జాతీయ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకం కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో ఆయన ఢిల్లీ పర్యనటకు వెళ్లనున్నట్లు సమాచారం. త్వరలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో CMలు స్టాలిన్, మమతా బెనర్జీలు, పినరయి విజయన్‌లతో చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో ఢిల్లీలోని BRS కేంద్ర కార్యాలయాన్ని కూడా సందర్శించనున్నారు.

March 4, 2026 / 04:22 PM IST

‘నూతన ఐమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి’

SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో క్రాస్ రోడ్ నుంచి పాత ఊరు వరకు ఏర్పాటు చేసిన సోలార్ ఐమాస్ట్ లైట్లు కొన్ని స్తంభాలకు వేలాడుతూ, మరి కొన్ని స్తంభాలకు పని చేయకుండా దర్శనమిస్తున్నాయి. రాత్రి వేళల్లో రహదారంతా చీకటి అలుముకుని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున, అధికారులు స్పందించి వాటి స్థానంలో నూతన లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

March 4, 2026 / 04:22 PM IST

‘వైసీపీ పాలనలో కల్తీ రాజకీయాలు’

అన్నమయ్య: వైసీపీలో బడుగు బలహీన వర్గాలను విస్మరించి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాషా ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయం అందిస్తోందని తెలిపారు.

March 4, 2026 / 04:22 PM IST

అంగన్వాడీ కేంద్రాల సమగ్ర పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు

NLG: చిట్యాల మండలం ఆరెగూడెంలో బుధవారం అంగన్వాడీ కేంద్రాల సమగ్ర పర్యవేక్షణ కమిటీని ఎన్నుకున్నారు. ఛైర్మెన్ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, కన్వీనర్లుగా మురాల నవనీత, తురిమెళ్ళ కవితతో పాటు సభ్యులుగా ఉదయశ్రీ, దీప్తి, పల్లవి, సంధ్యారాణి నియమితులయ్యారు. హెచ్‌ఎం అరుణ, ఆశా వర్కర్లు పాల్గొన్న ఈ సమావేశంలో అంగన్వాడీల పనితీరును పర్యవేక్షించనున్నారు.

March 4, 2026 / 04:20 PM IST

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

KKD: తాళ్లరేవు మండలం సీతారామపురం గుడ్డివానితూము కూడలిలోని ఒక భవనంపై బుధవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ఎర్రని బనియన్ ధరించి, చేతికి కడియం కలిగి ఉన్నాడు. వారం రోజుల కిందటే మృతి చెంది ఉంటాడని కోరింగ పోలీసులు భావిస్తున్నారు.

March 4, 2026 / 04:20 PM IST

లక్ష్మీపతి రెడ్డిని పరామర్శించిన శ్రీధర్ రెడ్డి

సత్యసాయి: నల్లమాడ మండలం రాగానిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి లక్ష్మీపతి రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కదిరిలోని ఆయన నివాసానికి వెళ్లారు. లక్ష్మీపతి రెడ్డిని పరామర్శించి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

March 4, 2026 / 04:20 PM IST

అపచారం చేస్తే 11 సీట్లు కూడా రావు: సోము వీర్రాజు

AP: వైసీపీ నేతలు హిందువులకు అపచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ‘రూ.620కి కల్తీ నెయ్యి కొంటే తప్పు అంటున్నారు. రూ.320కి కల్తీ నెయ్యి కొనమంటున్నారు. జగన్ ప్రభుత్వంలో 325 ఆలయాలను కూల్చేశారు. బీజేపీకి చెందిన హిందూ భక్తులపై కేసులు పెట్టారు. వైసీపీ నాయకులకు భక్తి ఉంటే చర్చలో పాల్గొనాలి. స్వామివారికి అపచారం చేస్తే 11 సీట్లు కూడా రావు’ అని విమర్శించారు.

March 4, 2026 / 04:20 PM IST

సిరికొండలో ఘనంగా లైన్‌మెన్ దినోత్సవం

NZB: జాతీయ భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏఈ చంద్రశేఖర్ అధ్యక్షతన లైన్‌మెన్ దినోత్సవాన్ని సిరికొండ సబ్ స్టేషన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాకారం రవి ముఖ్య అతిథిగా హాజరై విద్యుత్ శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసించారు.

March 4, 2026 / 04:20 PM IST

ఖమ్మం టూ టౌన్ వద్ద నిలిచిన ట్రాఫిక్ సిగ్నల్స్

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన గల ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం హోలీ పండుగ సందర్భంగా యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరారు. సిగ్నల్ వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో వాహనాలు అడ్డదిడ్డంగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని బాటసారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 4, 2026 / 04:17 PM IST