• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బైకుల దొంగతనం.. నిందితుడి ఫోటో విడుదల

కోనసీమ: అమలాపురం పట్టణంలో వరుస బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి ఆచూకీ తెలపాలని క్రైమ్ పార్టీ ఎస్సై అయితా బత్తుల బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా దొంగకు సంబంధించిన ఫోటోలను గురువారం ఆయన మీడియాకు విడుదల చేశారు. ఇటీవల అమలాపురం కిమ్స్ హాస్పిటల్ వద్ద ఈ వ్యక్తి బైక్ దొంగతనం చేసిన ఆధారాలు లభించాయన్నారు.

April 2, 2026 / 12:34 PM IST

విద్యానికేతన్ విద్యార్థుల ‘డే హైక్’ విజయవంతం

VSP: గాజువాక సాయిరాం నగర్‌లోని స్వామి విద్యానికేతన్ హై స్కూల్‌లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ‘డే హైక్’ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5 గం నుంచి సా. 6 గం వరకు సాగిన ఈ సాహసయాత్రలో విద్యార్థులు వివిధ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.హైక్‌లో భాగంగా అల్పాహారం నుంచి భోజనం వరకు విద్యార్థులే వంటలు తయారు చేసుకుని తమ స్వయంకృషిని చాటుకున్నారు.

April 2, 2026 / 12:33 PM IST

విశాఖ ఉక్కు టర్నోవర్ 22% వృద్ధి

AKP: విశాఖ ఉక్కు కర్మాగారం 2025-26లో గణనీయ వృద్ధిని నమోదు చేసింది. కీలక ఉత్పత్తి విభాగాల్లో 52% పెరుగుదల సాధించింది. హాట్ మెటల్ ఉత్పత్తి 5.95 మిలియన్ టన్నులకు, లిక్విడ్ స్టీల్ 5.69 మిలియన్ టన్నులకు చేరాయి. క్రూడ్ స్టీల్ 5.43 మిలియన్ టన్నులతో 51% వృద్ధి నమోదు చేసింది. టర్నోవర్ రూ.22,311 కోట్లకు చేరి 22% పెరిగింది.

April 2, 2026 / 12:33 PM IST

‘తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఒకరోడ్ మోడల్’

SRCL: దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్‌గా మారిందని, ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ. 1 కోటి 15 లక్షల మంది రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు రూ. 5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నామన్నారు.

April 2, 2026 / 12:32 PM IST

హ‌నుమాన్ జ‌యంతి శుభాకాంక్షలు: కేసీఆర్‌

TG: రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామచంద్రమూర్తి భక్తుడిగా బలం, జ్ఞానం, వాక్చాతుర్యం అన్నీ కలిసి అరుదైన వ్యక్తిత్వం కలిగిన జ్ఞానిగా, హిందూ పురాణాలు హనుమంతుడిని కీర్తిస్తాయని గుర్తుచేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు.

April 2, 2026 / 12:32 PM IST

చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం

TPT: చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా చేయు G.O ఇచ్చిన సందర్భంగా, ప్రభుత్వానికి ధన్యవాదలు తెలుపుతూ, చంద్రబాబు చిత్ర పటానికి గురువారం నారాయణవనం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మరమగ్గ కార్మికులు, మొదలియార్ సంఘం నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది.

April 2, 2026 / 12:31 PM IST

గ్రామ సభల్లో అధికారులను నిలదీయండి: మాజీ MLA

JN: ప్రజలు తమ హక్కులను సాధించుకోవడానికి అధికారులను నిలదీయాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ MLA తాటికొండ రాజయ్య కోరారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి గ్రామసభలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ సభలలో BRS కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీయాలని పిలుపునిచ్చారు.

April 2, 2026 / 12:30 PM IST

పెద్దరెడ్డిపల్లిలో పీఎం, సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం

సత్యసాయి: పరిగి మండలం పెద్దరెడ్డిపల్లిలో గురువారం ఎన్టీఆర్, పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి, లోకేశ్ మంత్రి సవిత చిత్రపటాలకు గురువారం పాలాభిషేకం చేశారు. టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. చేనేత మగ్గాల కార్మికులకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్ కార్మికులకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు.

April 2, 2026 / 12:30 PM IST

బొజ్జ పెద్దగా ఉంటేనే ఇక్కడ అందగాళ్లు!

ఇథియోపియాలోని బోడి తెగలో పురుషులకు పొట్ట ఎంత పెద్దగా ఉంటే అంత అందగాళ్లుగా భావిస్తారు. వీరు ‘కాయెల్’ పండుగలో భాగంగా అతిపెద్ద బొజ్జ కోసం పోటీ పడతారు. మరింత వేగంగా శరీర బరువు పెరగడానికి వారు ప్రత్యేకంగా ఆవు పాలు, రక్తం కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటారు. భారీ పొట్ట ఉన్నవారే వారి సంప్రదాయంలో హీరోలుగా చలామణీ అవుతారు. ఇది వారి సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన ఆచారంగా కొనసాగుతోంది.

April 2, 2026 / 12:30 PM IST

కేరళం ఎన్నికల పరిశీలకుడిగా చల్లా సతీష్‌

KMM: యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు, వైరా నియోజకవర్గ నాయకుడు చల్లా సతీష్‌కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయనను ‘ఎన్నికల పరిశీలకుని’గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేరళలోని ఆలప్పుళ జిల్లాకు చెందిన చెంగన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల వ్యవహారాలను సతీష్ పర్యవేక్షించనున్నారు.

April 2, 2026 / 12:30 PM IST

మున్సిపల్ వార్డు సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: చేవెళ్ల నియోజకవర్గం, శంకర్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రగతి-ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జరిగిన మున్సిపల్ వార్డు సభలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.

April 2, 2026 / 12:30 PM IST

కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం

CTR: చిత్తూరు కలెక్టర్ కార్యాలయ సమీపంలోని కాఫీ దుకాణం వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసుల వివరాల మేరకు.. పులిచెర్ల మండలానికి చెందిన మోహన్ (28) కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగాడు. పోలీసులు వెంటనే స్పందించి 108లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

April 2, 2026 / 12:30 PM IST

ఉమ్మడి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు సంప్రదాయ పంటలను వీడి వాణిజ్య సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. పత్తి, మిరపకాయల నిలయమైన ఈ ప్రాంతంలో ప్రస్తుతం 30 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోంది. ములుగు జిల్లా ఇంచర్లలో 12 ఎకరాల్లో కేఎన్ బయోసైన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కారణంగా రైతుల్లో ఆయిల్ పామ్ పంటపై నమ్మకం పెరిగింది.

April 2, 2026 / 12:30 PM IST

వైభవంగా ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం

KKD: కోరుకొండలో శ్రీ సీతారాముల ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని సీతారాముల వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

April 2, 2026 / 12:30 PM IST

‘అందరి సహకారంతో గ్రామం అభివృద్ధి’

ELR: ఐదు సంవత్సరాల పాలనలో అందరి సహకారంతో అభివృద్ధి చేశానని సర్పంచ్ దిడ్ల అలకనంద శ్రీనివాస్ అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామపంచాయతీ పాలకవర్గం పూర్తి కావడంతో పంచాయితీ అభివృద్ధి అధికారి విజయ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్‌తో పాటు పాలకవర్గ సభ్యులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయితీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

April 2, 2026 / 12:28 PM IST