BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బదిలీ అయినట్లు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా భద్రాద్రి జిల్లాకు నూతన కలెక్టర్గా నిజామాబాద్ అదనపు కలెక్టర్గా పని చేస్తున్న అంకిత్‌ను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. టీజీ ఎన్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్ను నియమించారు.
నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి ప్రాజెక్టును దర్శకుడు శ్రీకాంత్ విస్సాతో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబో ఇప్పటికే లాక్ అయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2026 ద్వితీయార్థంలో ప్రారంభం కానుందట. అదే ఏడాది చివరి నాటికి సినిమాను థియేటర్లలో విడుదల చేసేలా మేకర్స్ పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతున్నట్లు సమాచారం.
NGKL: జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలువురు అధికారుల బదిలీల్లో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు వివిధ బాధ్యతల్లో తనదైన ముద్ర వేసిన ఆయన, ఇకపై జిల్లా పాలనా యంత్రాంగంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
మెదక్ జిల్లాకు నూతన కలెక్టర్‌గా ప్రతిమ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న రాహుల్ రాజ్‌ను సహకార శాఖకు బదిలీ చేశారు. ప్రతిమా సింగ్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కలెక్టర్‌గా పదోన్నతితో మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. అదనపు కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
AP: కర్నూలు జిల్లా పత్తికొండలోని కొండగేరివీధిలో విషాదం చోటుచేసుకుంది. మహాలక్ష్మి(26) అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త, అత్తమామలు కొట్టి ఉరివేసి చంపారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, అనారోగ్య కారణాల వల్ల ఉరివేసుకుని మృతిచెందినట్లు భర్త బంధువులు చెబుతున్నారు.
SRCL: జిల్లాలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు ఇవాళ ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు 16 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్ష రాయడం పూర్తిచేసిన పరీక్ష సమయం ముగిసిన తర్వాతనే బయటకు పంపిస్తారు.
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండో సంవత్సరం విద్యార్థులు నేడు తెలుగు సాంస్కృత పరీక్షలను రాయనున్నారు.
RR: చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా స్లాబ్ పనులను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి కల ప్రజా ప్రభుత్వంలో నెరవేరిందని, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు పక్కా ఇంటిని నిర్మించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
JN: రాష్ట్ర ప్రభుత్వం గురువారం భారీగా కలెక్టర్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషను, జోగులంబ గద్వాల్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయన స్థానంలో సందీప్ కుమార్ ఝూను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వెంటనే ఈ బదిలీలు అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
MBNR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు సహా ఇద్దరు అదనపు కలెక్టర్ల పై బదిలీ చేసింది. మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, గద్వాల కలెక్టర్ బి.ఎం.సంతోష్‌లను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ (మహబూబ్ నగర్), కీమ్యా నాయక్ (వనపర్తి)లకు కూడా స్థానచలనం కలిగింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు తెరదించుతూ, రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ మూవీలతో మెప్పించిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటి అవ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
కడపలో దేశానికే స్ఫూర్తిగా ఏర్పాటైన ‘సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్’ ద్వారా పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని చేరవేసేందుకు సిద్ధం చేసిన అధునాతన ఫుడ్ ట్రక్కులను కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి బుధవారం రాత్రి పరిశీలించారు. యూలర్ సంస్థ ప్రతినిధులు కలెక్టరేట్‌లో ఈ ట్రక్కుల పనితీరు, మానిటరింగ్ విధానంపై కలెక్టర్‌కు డెమో ఇచ్చి, వాటి ప్రత్యేకతలను వివరించారు.
W.G: తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పి.సత్యనారాయణను మొగల్తూరుకు, ఎం.రాజ్యలక్ష్మిని భీమవరం వన్ టౌన్‌కు పంపారు. ఇటీవల స్టేషన్ సిబ్బందిపై వచ్చిన పలు ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపిన అనంతరం ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
BPT: కర్లపాలెం సెంటర్, మసీదు, బుద్దాం, గణపవరం రోడ్లలో ఎస్సై రవీంద్ర గురువారం తనిఖీలు నిర్వహించారు. గంజాయి విక్రయించినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. కొత్త వ్యక్తులు వస్తే గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు. అలాగే, నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని ఆయన హెచ్చరించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ X వేదికగా పోస్ట్ చేశారు. ‘హిందుత్వాన్ని జాతీయ చైతన్య దీప్తిగా ప్రతిష్ఠించిన మహా తపస్వి. సనాతన ధర్మ రక్షణే స్వరాజ్య సంకల్పంగా చాటిన అజేయ ధైర్యస్వరూపి. అండమాన్ కారాగార అంధకారంలోనూ స్వాభిమాన జ్యోతిని వెలిగించిన ధీశాలి. వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళులు’ అంటూ పేర్కొన్నారు.